- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికలాంగులు కాదు.. సకలాంగులు..
వైకల్యం అంటే శక్తి లేదా సామర్థ్యం లేకపోవడం (ఆశక్తత) అని అర్థం. వికలాంగులు అంటే పుట్టుకతో గాని, అనారోగ్యంతో గాని, లేదా ప్రమాదాల కారణంగా గాని శారీరక, మానసిక అంగాలలో లోపాలు ఉన్న వ్యక్తులు.. వీరిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులు అని కూడా పిలుస్తారు. ప్రభుత్వ నిర్వచనం ప్రకారం 40% కంటే తక్కువ కాకుండా వైకల్యం ఉండి ధ్రువీకరణ

వైకల్యం అంటే శక్తి లేదా సామర్థ్యం లేకపోవడం (ఆశక్తత) అని అర్థం. వికలాంగులు అంటే పుట్టుకతో గాని, అనారోగ్యంతో గాని, లేదా ప్రమాదాల కారణంగా గాని శారీరక, మానసిక అంగాలలో లోపాలు ఉన్న వ్యక్తులు.. వీరిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులు అని కూడా పిలుస్తారు. ప్రభుత్వ నిర్వచనం ప్రకారం 40% కంటే తక్కువ కాకుండా వైకల్యం ఉండి ధ్రువీకరణ పత్రం ఉన్న భారత పౌరులు వికలాంగులుగా చెప్పబడతారు. వారికి ‘దివ్యాంగులు’ అనే పదాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ 2019లో సూచించడం జరిగింది. వైకల్యం శరీరానికే గాని మనసుకు కాదు అనే ఉద్దేశంతో ఈ పదాన్ని సూచించడమైంది.
వారిలో మనోస్థైర్యాన్ని పెంచేందుకు..
2025 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక జీవితంలోని ప్రతి అంశంలో వికలాంగుల ఏకీకరణను, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి వైకల్యాన్ని కలుపుకొని ఉన్న సమాజాలను పెంపొందించడం దీని ఉద్దేశం. ‘శారీరకంగా వికలాంగులైనా మానసికంగా సకలాంగులతో సమానమే... రోడ్డులో ఒక మలుపు చివర కాదు, మీరు మలుపు తిరగకపోతే తప్ప’ అనేది ఒక ఆదర్శంగా మారింది. వైకల్యం ఉన్న వ్యక్తులపై సమాజం బాధ్యతగా మెలగాలన్న ఐక్యరాజ్యసమితి సూచనలతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. విక లాంగులు కుంగుబాటుకు, వెనుకబాటుకు గురి కాకుండా వారిలో మనోస్థైర్యాన్ని పెంచి వారికి సమాజంలో సముచిత స్థానాన్ని ఏర్పాటు చేసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
సమాజ మద్దతు అవసరం!
ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల (ప్రపంచ జనాభాలో 16%) కంటే ఎక్కువ మంది ప్రజలు ఏదో ఒక వైకల్యంతో బాధపడు తున్నట్లు అంచనా. ఐక్యరాజ్యసమితి వికలాంగుల స్థిరమైన అభివృద్ధి కోసం 2030 ఎజెండాను అమలు చేసి వారికి సమాన అవకాశాల కల్పన దిశగా పనిచేయటం లక్ష్యంగా పెట్టుకుంది. జీవితాల్లో ఒడిదుడుకులను సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి వికలాంగులకు కుటుంబ మద్దతు, సహకారం అత్యంత ముఖ్యంగా చెప్పవచ్చు. వారి దైనందిన జీవితంలో వారి అవసరాలకు కావ లసిన సహకారం, తోడ్పాటునిస్తూ వారిని ముందుకు సాగేలా ప్రోత్సహించడం కుటుంబ బాధ్యత. అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వికలాంగులకు తగిన మద్దతును, భద్రతను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణాలో 43 లక్షల మంది..
మన రాష్ట్రంలో సుమారుగా 43.02 లక్షల మంది వికలాంగులు ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. కానీ అందరికీ సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫు నుండి పొందటంలో ఇబ్బందులు సైతం లేకపోలేదు.. అర్హులైనప్పటికీ ఆసరా అందక, సరైన చేయూత లేక వారి కనీస అవసరాలను సైతం తీర్చుకోలేకపోతున్నారు. మహిళా వికలాంగులపై దాడులు, వేధింపులు పెరిగి పోతున్న ఈ రోజుల్లో వారికి సరైన సామాజిక మద్దతు, భద్రత నివ్వటం పౌరులుగా మన అందరి బాధ్యత.
వికలాంగుల సంక్షేమం..
వికలాంగుల హక్కుల చట్టం 2016 వికలాంగులకు సమాన అవకాశాలను కల్పించడాన్ని నిర్ధారిస్తుంది. పబ్లిక్ సర్వీసుల్లో వారి ప్రాతినిధ్యం పెరిగేలా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం పొందని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా వారు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం తరఫున రుణాలను సైతం అందించటం గమనార్హం. వారి సామర్థ్యానికి తగినట్లు ఉద్యోగ అవకాశాలు కల్పన, పెన్షన్లు, వివిధ రకాల స్కీంల ద్వారా వారికి ప్రభుత్వాలు సరైన చేయూతను అందించడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
(నేడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం)
- డాక్టర్.ఎస్.రాధ
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
99897 41502






