- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టు తప్పుతున్న పల్లె పాలన..
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలని అన్నారు ఒక మహానుభావుడు. కానీ నేడు తెలంగాణ పల్లెలను గాలికి వదిలేశారు పాలకులు..

దేశానికి పల్లెలు పట్టుగొమ్మలని అన్నారు ఒక మహానుభావుడు. కానీ నేడు తెలంగాణ పల్లెలను గాలికి వదిలేశారు పాలకులు.. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసే ఆరు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ చేపట్టాలి. లేని పక్షంలో పాలకవర్గాల గడువు ముగిసిన ఆరు నెలల్లో కొత్త పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల గడువు ముగిసి సంవ త్సరం దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలనా వ్యవస్థ పట్టుతప్పుతోంది. గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 2024 ఫిబ్రవరి మొదటి వారంలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి ఒక్కో అధికారికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. వారి శాఖ లకు సంబంధించిన విధి నిర్వహణలపైనే ఆ అధికారులు దృష్టి సారిస్తుండడంతో పంచాయతీల పాలన పట్టాలు తప్పింది. ఇక గత పదహారు నెలలుగా గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడంతో స్థానిక సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత 15 నెలలుగా సర్పంచులు, వార్డు సభ్యులు జడ్పీటీసీలు, మండల పరిషత్ పాలక వర్గాలు కూడా ఖాళీగానే ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నుండి, 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన గ్రాంట్లు, నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు పనులు ఆగిపోయి ప్రజలకు మౌలిక వసతులు అందడం లేదు. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, సీసీ రోడ్లు వంటి ప్రాథమిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడంతో గ్రామీణాభి వృద్ధిపై పాలకులకు ధ్యాసే లేదనిపిస్తుంది.
-పసుల మహేష్
81064 15716
- Tags
- Rural governance






