పటాకులు కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

by Ravi |
పటాకులు కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
X

పటాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. పటాకులు కాల్చేటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయి. బాణసంచాలను ఇంటిలో కాల్చకూడదు. ఇంటికి దూరంగా బహిరంగ ప్రదేశాలలో కాల్చడం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. పటాకులు కొన్నిసార్లు పేలకుండా ఆగిపోతాయి. వాటిని వెంటనే వెళ్లి పట్టుకోవడం లాంటివి చేయకూడదు. ముందుగా వాటిపై నీటిని పోయడం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. అల్కహాల్, శానిటైజర్‌లను వాడాక పటాకులను వెలిగించకూడదు. దీపావళి రోజు శానిటైజర్ వాడకపోవడం మంచిది. పటాకుల పైన ఇచ్చిన సలహాలు సూచనలను ఖచ్చితంగా చదివి పాటించాలి. మంటలు అంటుకునే ప్రదేశాలు, కరెంటు తీగలు, ఎండు గడ్డి, పూరి గుడిసెలు ఉన్న ప్రదేశాలలో పటాకులు కాల్చకూడదు. పటాకులను కాల్చి రోడ్డు మీద పడేయడంతో దారి వెంట వెళ్లే వారికి ప్రమాదం కలగవచ్చు.

టాకులకు ఆద్యులు చైనీయులు. క్రీ.పూ. 200 సంవత్సరంలోనే వారు వెదురు (బాంబూ) టపాకాయలు వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. దాన్ని చైనా భాషలో బాజు అంటారు. పేలుతున్న వెదురు అని అర్థం. తుపాకి మందు కనిపెంటేంత వరకు వెదురు టపాసులనే చైనావారు వాడేవారు. క్రీ.శ. 600 ప్రాంతంలో చైనావారు తుపాకి మందుని కనిపెట్టారు. గన్ పౌడర్ లేక బ్లాక్ పౌడర్ రసాయన పేలుడు పదార్థం. ఇది గంధకం, చార్కోల్, పొటాషియం నైట్రేట్ మిశ్రమం. దీన్ని సాల్ట్ పౌడర్ అంటారు. ఇది మండినప్పుడు 427 నుంచి 464 డిగ్రీల ఉష్ణం వెలువడుతుంది. దీని తరువాత చేసేవారు అందుకే టపాసులకు బాజు పేరు స్థిరపడిపోయింది.

క్రీ.శ. 900 సంవత్సరంలో చైనా నుండి పటాకులు ఇంగ్లాండు, అరబ్బు దేశాలు, భారతదేశానికి చేరుకున్నాయి. మనదేశంలో పటాకుల పరిశ్రమ తమిళనాడులోని శివకాశిలో విస్తరించి వుంది. దేశంలోని టపాకాయల ఉత్పత్తిలో 70 శాతం ఇక్కడి వెయ్యికి పైగా పరిశ్రమలలో తయారవుతాయి. పరిశ్రమలలో పనిచేసేవారు ముఖ్యంగా పసిపిల్లలు. వారిలో 4 నుంచి 16 సంవత్సరాల లోపు వారు 30 శాతం మంది వున్నారు. అందులో 90 వాతం మంది ఆడపిల్లలు, పేద పిల్లలు, వెనుకబడిన తరగతి వారు. చేతులకు ఎలాంటి గ్లౌజులు లేకుండా ప్రమాదకర రసాయన పదార్థాలలో పటాకులు తయారు చేస్తున్నారు. రసాయనాలతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులతో బాధ పడుతున్నారు. ప్రభుత్వ చట్టాలు ఎన్ని వున్నా పిల్లలు చేసే ఈ చాకిరీని అరికట్టలేక పోతున్నారు.

ప్రమాద కారకాలు

1991లో శివకాశిలో ఓ ఫ్యాకరీలో జరిగిన పేలుడు వలన 39 మంది చనిపోయారు. 65 మంది గాయపడ్డారు. 2009, జూలైలో జరిగిన ప్రమాదంలో 40 మంది చనిపోయారు. ఆగస్టు 2011లో ఫ్యాక్టరీ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా ఐదుగురు గాయపడ్డారు. సెప్టెంబర్ 2012 ప్రమాదంలో 40 మంది చనిపోగా 38 మంది గాయపడ్డారు. ఇవి అధికారిక లెక్కలు కాగా, నిజానికి ఎక్కువగానే ప్రమాదాలు జరిగి వుంటాయి. పటాకులతో పర్యావరణం దెబ్బతింటుంది. గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం, రసాయన కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. పటాకులు కాల్చినప్పుడు శబ్దం 140 డెసీబెల్స్ దాటుతోంది.

ఆరోగ్యపరంగా శబ్దాలు 125 డెసిబెల్స్ దాటకూడదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టపాకాయల శబ్ద తీవ్రత 125 డెసిబెల్స్ దాటకూడదు. పటాకుల తయారీ కంపెనీలు నియమాన్ని పాటించడం లేదు. ఈ శబ్దాల వలన తాత్కాలిక చెవుడు, శాశ్వత చెవుడు ఏర్పడుతున్నది. అధిక శబ్దం వల్ల వినికిడి సమస్యలు, రక్తపోటు, గుండెపోటు, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తున్నాయి. ఎన్నో రకాల ప్రమాదాలు పొంచి వున్నాయి. పటాకులు కాల్చడంలో అగ్ని ప్రమాదాలు కోకొల్లలు. చేతిలో చిచ్చుబుడ్డి పేలడం, ఒళ్లు కాలడం, బట్టలు కాలి పోవడం జరుగుతూనే వుంటాయి. చాలా మంది కళ్లు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం.

ఈ సూచనలు పాటించండి

పటాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. పటాకులు కాల్చేటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయి. పటాకులను ఇంటిలో కాల్చకూడదు. ఇంటికి దూరంగా బహిరంగ ప్రదేశాలలో కాల్చడం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. పటాకులు కొన్నిసార్లు పేలకుండా ఆగిపోతాయి. వాటిని వెంటనే వెళ్లి పట్టుకోవడం లాంటివి చేయకూడదు. ముందుగా వాటిపై నీటిని పోయడం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. అల్కహాల్, శానిటైజర్‌లను వాడాక పటాకులను వెలిగించకూడదు. దీపావళి రోజు శానిటైజర్ వాడకపోవడం మంచిది. పటాకుల పైన ఇచ్చిన సలహాలు సూచనలను ఖచ్చితంగా చదివి పాటించాలి.

మంటలు అంటుకునే ప్రదేశాలు, కరెంటు తీగలు, ఎండు గడ్డి, పూరి గుడిసెలు ఉన్న ప్రదేశాలలో పటాకులు కాల్చకూడదు. పటాకులను కాల్చి రోడ్డు మీద పడేయడంతో దారి వెంట వెళ్లే వారికి ప్రమాదం కలగవచ్చు. ఒక బకెట్లో ఇసుక పెట్టుకొని అందులో కాల్చిన కాకర పువ్వులను, పటాకులను వేయడం మంచిది. ముందస్తు జాగ్రత్తగా ఒక బకెట్ నిండా నీటిని పక్కన ఉంచుకోవాలి. చిన్నపిల్లలకు పెద్దవారే దగ్గరే ఉండి జాగ్రత్తగా కాల్పించాలి. వీలైనంత వరకు అందరూ కూడా కాటన్ దుస్తులను ధరించాలి. పటాకులు కాల్చిన చేతులతోనే ముక్కు, చెవులు, కళ్లను రుద్దుకుంటారు. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకుని గార్గిలింగ్ చేయాలి.

ఆనంద దీపావళి కావాలి

గాయం అయితే దాని మీద పదిహేను నిమిషాల పాటు చన్నీరు, వేడి నీరు పోయరాదు. తర్వాత ధారగా పోయాలి లేదా నీటి కుళాయి కింద పెట్టాలి. గాయమైన అరగంట లోపల ఈ చికిత్స జరగాలి. ఇలా చేయడం వలన వేడి తగ్గిపోతుంది. కంటికి చువ్వలాంటిది తగిలి గాయం అయినప్పుడు వెంటనే చేత్తో కానీ కంటిని రుద్దుతారు. చాలా ప్రమాదం. గాయం తీవ్రత పెరగడానికి, గాయం విస్తరించడానికి కారణం అవుతుంది. కంటికి వస్త్రంతో గట్టిగా కట్టు కట్టకూడదు. ఇలా చేస్తే కంటిలో గుచ్చుకున్న నలుసు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గాయమైన కంటిని కప్పు లేదా షీల్డుతో కప్పి డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లాలి.

రసాయనాలు కంటిలో పడితే కంటిని పరిశుభ్రమైన నీటితో కడగాలి. కంటిని రుద్దకుండా దోసిలితో నీటిని తీసుకుని కంటికి తగిలేటట్లు చేస్తూ శుభ్రం చేయాలి. పటాకుల వినియోగాన్ని తగ్గించాలి. అధిక శబ్దాలు వెలువరించే పటాకులు కాల్చకూడదు. అవి పర్యావరణానికి ప్రమాద కారకాలు. పటాకుల కోసం డబ్బు వృథా చేయవద్దు. వెలుగులు నింపే దీపాలతో దీపావళి చేసుకుందాం. పర్యావరణ పరిరక్షణ దీపావళిని జరుపుకుందాం.


రామకిష్టయ్య సంగనభట్ల

9440595494

Next Story