దేశంలో రాజకీయ ఆరాచకం..

by Disha edit |
దేశంలో రాజకీయ ఆరాచకం..
X

'చట్టాన్ని కాపాడాల్సిన నేతలు, ఆడబిడ్డలను రక్షించాల్సిన నేతల కొడుకులే క్రిమినల్స్‌గా మారితే ఎలా? యూపీలోని లఖిమ్‌పూర్ ఖేరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టేని కొడుకు తండ్రి వాహనంతో తొక్కించి నలుగురు రైతులను, ఒక జర్నలిస్టును చంపేశాడు. కొడుకును జైలులో పెట్టినా, తండ్రి ఇంకా మంత్రిగానే ఉన్నారు. ఇతని మీద మర్డర్ కేసు కూడా ఉంది. ఎన్‌సీ‌ఆర్‌బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 31,677 రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన రోజుకు 86 కేసులు నమోదవుతున్నాయి. మహిళల మీద జరిగిన అఘాయిత్యా సంఖ్య గంటకు 49 దాకా ఉంది. అత్యాచారం కేసులలో 99.5 శాతం బాధితులకు తెలిసినవారే ఉంటున్నారని చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై 15 నాటికి ఆడబిడ్డల కిడ్నాప్ కేసులు 2,197 నమోదయ్యాయి.'

దేశంలో ప్రస్తుతం 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 43 శాతం మంది ప్రజా ప్రతినిధులకు క్రిమినల్ రికార్డు ఉందని వారి అఫిడవిట్‌లు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో బీజేపీ టాప్‌లో ఉంది. కేంద్రంలో మంత్రులుగా ఉన్న కొందరిలోనూ క్రిమినల్ కేసులు ఉన్నాయి. బీజేపీ టాప్ ప్రజా ప్రతినిధులలో 83 మంది మీద క్రిమినల్ రికార్డు ఉంది. గతంలో 55 మంది ప్రజా ప్రతినిధులకు శిక్షలు పడగా, అందులో 13 మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దేశంలో 296 మంది ఎమ్మెల్యేలు, 67 మంది నాయకుల మీద కేసులు ఉన్నాయి. రాష్ట్రాలలో మంత్రులుగా ఉన్న 35 మంది మీద, నలుగురు కేంద్ర మంత్రుల మీద కేసులు నడుస్తున్నాయి. ఇక వీరి పుత్రరత్నాల, బంధుమిత్రుల ఆగడాలు ఇంతా అంతా కాదు. దేశంలో వీరి ఆరాచకాల వలననే క్రైమ్ రేటు పెరుగుతున్నది. గత ఎనిమిదేండ్ల నుంచి ఆడ బిడ్డల మీద అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. 'బేటీ బచావో-బేటీ పఢావో' అంటూ ఆర్భాటాలతో, ప్రచారాలతో కేంద్ర ప్రభుత్వం కాలం గడుపుతోంది. నిజానికి చాలా సంఘటనలలో రాజకీయ నేతలు, వారి కొడుకులు, సమీప బంధువుల ప్రమేయం ఎక్కువగా ఉంటున్నది.

ఇక్కడ కూడా అంతే..

తాజాగా ఉత్తరాఖండ్‌లోని హృషికేష్ సమీపంలో గల ఒక బీజేపీ నాయకుడి రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే అంకిత భండారి (19) హత్య ఈ దేశంలోని లీడర్ల కొడుకులు, స్నేహితుల విచ్చల‌విడితనాన్ని బట్ట బయలుచేసింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అంకిత హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేసింది. రిసార్ట్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని ఆమె గ్రామం గుట్టల ప్రాంతంలో ఉంటుంది. తల్లి అంగన్‌వాడీ కార్యకర్త, తండ్రి చిన్న చిన్న పనులు చేసుకుంటాడు. గత ఆగస్టు 18న రిసార్ట్ ఉద్యోగంలో చేరింది. అక్కడే ఒక గదిలో ఉంటోంది. రిసార్ట్ బాధ్యతలను బీజేపీ నేత, కేబినెట్ మంత్రి హోదా గల పదవిలో పని చేసిన వినోద్ ఆర్య కొడుకు పులకిత్ ఆర్య చూస్తున్నాడు. అడవికి దగ్గరగా ఉన్న ఆ రిసార్ట్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరిగేవనే ఆరోపణలు ఉన్నాయి. అంకితను కూడా అనేక రకాలుగా వేధించారని సమాచారం. ఈ నెల 18న జాబ్ వదిలి ఇంటికి వెళ్లిపోదామని భావించి తన స్నేహితురాలితో చాట్ కూడా చేసిందని తేలింది.

పులకిత్ ఆర్యతో అంకిత గొడవ కూడా పడింది. పులకిత్, రిసార్ట్ మేనేజర్ సౌరబ్ భాస్కర్, అతని సహాయకుడు గుప్తా అంకితను తీసుకుని రెండు బైకుల మీద సమీపంలోని బ్యారేజ్ దగ్గరికి వెళ్లారు. అక్కడే అంకితను కొట్టి, చంపి నదిలో పడేసారు. వీరు బైకుల మీద వెళుతున్న, వస్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి విషయం రాబట్టారు. ఈనె 24న అంకిత శవం నదిలో లభించింది. అంకిత కనిపించడం లేదంటూ పులకిత్ ఆర్య ఈ నెల 18నే ఆమె తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో డీఎం (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్)ను కలిశారు. ఈలోపు విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం, రిసార్ట్‌ను తగలబెట్టడం, రాష్ట్రమంతా నిరసనలు వెల్లువెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేసారు. పులకిత్ తండ్రి వినోద్ ఆర్యను, ఆయన తమ్ముడిని బీజేపీ సస్పెండ్ చేసింది. రిసార్ట్ అక్రమ కట్టడమంటూ కొంతమేర బుల్‌డోజర్‌తో కూల్చారు. సాక్ష్యాలు దొరకకుండా అంకిత ఉంటున్న గదిని కూల్చి వేశారని మహిళా సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.

పెరుగుతున్న అకృత్యాలు..

ఇదీ మన దేశంలో పరిస్థితి. చట్టాన్ని కాపాడాల్సిన నేతలు, ఆడబిడ్డలను రక్షించాల్సిన నేతల కొడుకులే క్రిమినల్స్‌గా మారితే ఎలా? యూపీలోని లఖిమ్‌పూర్ ఖేరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టేని కొడుకు తండ్రి వాహనంతో తొక్కించి నలుగురు రైతులను, ఒక జర్నలిస్టును చంపేశాడు. కొడుకును జైలులో పెట్టినా, తండ్రి ఇంకా మంత్రిగానే ఉన్నారు. ఇతని మీద మర్డర్ కేసు కూడా ఉంది. ఎన్‌సీ‌ఆర్‌బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 31,677 రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన రోజుకు 86 కేసులు నమోదవుతున్నాయి. మహిళల మీద జరిగిన అఘాయిత్యా సంఖ్య గంటకు 49 దాకా ఉంది. అత్యాచారం కేసులలో 99.5 శాతం బాధితులకు తెలిసినవారే ఉంటున్నారని చెబుతున్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి జులై 15 నాటికి ఆడబిడ్డల కిడ్నాప్ కేసులు 2,197 నమోదయ్యాయి. అత్యధిక రేప్ రేట్ రాజస్థాన్‌లో ఉండగా, తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. యూపీలో దళిత యువతి రేప్ మర్డర్, కూతురు శవం తల్లితండ్రులకు ఇవ్వకుండానే పోలీసులు దహనం చేసిన సంఘటనను దేశం ఇంకా మర్చి పోలేదు. ఇన్ని కేసులు నమోదవుతున్నా, 2019 లెక్కలను పరిశీలిస్తే 27.8 శాతమే కన్వెక్షన్ రేటు ఉంది. ఇందుకు కారణం పొలిటికల్ జోక్యం. కేసులను నయానా, భయానా బలహీనం చేయడమే. 2021లో రేప్‌కు గురైనవారిలో 4,940 మంది 18 యేండ్ల లోపు బాలికలే ఉన్నారు. 3,117 మంది కిడ్నాప్‌కు గురయ్యారు. ఇదంతా పాలకులకు కనిపించకపోవడం దారుణం

రాజకీయాలే ముఖ్యం..

ఎన్నికలు, గెలుపు, అధికారం పదిలం చేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ దేశ ప్రజల సంరక్షణ మీద లేదు. దేశం ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నది. నల్లధనం తొమ్మిది లక్షల కోట్లకు చేరింది. 94 వేల కోట్ల దాకా రెండు వేల రూపాయల నోట్లు, 1 లక్షా 90 వేల దాకా 500 రూపాయల నోట్లు బ్యాంకుల నుంచి మాయమయ్యాయని అంటున్నారు. డబ్బులు లేక వినియోగదారులు తగ్గారు. దేశంలో రిజర్వు కరెన్సీ 640 బిలయన్ డాలర్‌ల నుంచి 545 బిలియన్ డాలర్‌లకు తగ్గింది. ఇది చాలా ఆందోళనకర విషయం. ధరల నియంత్రణ ఆర్‌బీఐ చేతిలో లేకుండా పోయింది.

డాలర్‌తో మన రూపాయి విలువ 82కు పడిపోయింది. బ్యాంక్ రెపో రేటు పెరుగుతూ పోతోంది. గత ఆరు నెలలలో రుణాల మీద రెండు శాతం ఇంటరెస్ట్ పెంచారు. కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల సుదీర్ఘ జాప్యంతో 4.5 లక్షల కోట్ల అదనపు ఆర్థిక భారం పడింది. ఎగుమతులు, దిగుమతులు తగ్గడంతో 18.37 బిలియన్ డాలర్‌ల నష్టం జరిగింది. కేంద్రం గవర్నెస్ మీద విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. పార్లమెంట్‌లో విపక్షాలు ఇంత మౌనంగా ఎన్నడూ లేవు. పాలకులకు ఏదీ పట్టదు. నిరుద్యోగుల సంఖ్య 24 కోట్లకు చేరింది. టాక్స్ వసూలు డబుల్ అయ్యింది. బియ్యం, గోధుమలు, పిండి, నూనెలు, పప్పులు ఇలా అన్నింటి ధరలు పెరిగి సామాన్యులు ఆగం అవుతున్నారు. బుద్ధిజీవులు కదలాలి. ఈ దేశం మనది. మనమే కాపాడుకోవాలి.

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Next Story

Most Viewed