చలి పులి

by Ravi |   ( Updated:2025-01-13 18:31:01.0  )
చలి పులి
X

వేకువ పొద్దును

మంచు మేఘం కమ్మేసింది

నీటి బిందువులతో పై కప్పడం

శీతల బల్బులై వెలిగిపోతోంది

నులి వెచ్చని సూర్య కిరణం

పొగ మంచును చీల్చుకుంటూ

భూమిని బలవంతాన తాకింది

పులకరింతలతో దేహం

చలికి చిట్లిపోతోంది

చలువుదనంతో చేతి వేళ్ళుకు

చలనం ఆగిపోతోంది

ముదిరేసిన దేహాన్ని కదుపుతూ

ఒక ముసలి ప్రాణం

వణికిపోతూ కదులుతోంది

చలి తీవ్రత సుడిగుండంలో

ఒళ్లు జిల్లుమంటూ వణికిపోయింది

పెదవులు కదిపితే పలుకు

వణుకురాగం ఆలపిస్తోంది

గూటికి చేరిన పిట్టి

చలి పులి నోటికి బలైంది

దుప్పటి లేని అనాధ శరీరం

మంచు ముద్దలా మారిపోయింది

ఆశ్రయం లేని జీవనమొకటి

చలి కోరల మధ్య నలిగిపోయింది

మంచు తెరల బిందువుల మధ్య

మూగజీవి గడ్డకట్టుకుపోయింది

చల్లని పవనం స్పర్శిస్తూ వెళ్తుంటే

క్షణం సేపు ఒంట్లో స్పర్శ ఆగిపోయింది

మంచు పొగల మధ్యలో నగరం

ముసురుకుపోయింది

- నరెద్దుల రాజారెడ్డి

96660 16636

Advertisement

Next Story

Most Viewed