సంక్రాంతి

by Ravi |   (  Updated:2025-01-13 18:30:30  IST  )

Poem

సంక్రాంతి
X

ధనుర్మాస శ్రేష్ఠమా - వసంత ఆహ్లాదమా.

నేలతల్లి సంబరమా - దేశచరిత్ర అంబరమా.

రైతన్నల పరవశమా - భరతజాతి (అపు)రూపమా.

గడ్డలు కట్టే చలికి - భోగ మంటలు.

చిరంజీవి బలిచక్రవర్తికి - భోగి మంటలు.

రాక్షస గజాసురుని నీతి - ముక్కంటి ప్రీతి.

శనగల బసవన్న భక్తి - గంగిరెద్దుల కీర్తి.

చేతికొచ్చిన పసిడి పంటలు

నోరుమెచ్చిన పిండి వంటలు.

పిలిచే పూతరేకులు

పలికే కాకినాడ కాజాలు

సక్కనైన సకినాలు

సజ్జ రొట్టె కారాలు.

తిరిగే హరిదాసు పాటలు

ఎగిరే పతంగుల ఆటలు.

కోళ్ల పందాల సరదాలు

రికార్డింగ్ డాన్సుల వినోదాలు.

రంగుల ముగ్గులు

ముత్యాల ముగ్గులు.

అందాల సిగ్గులు

పొడవాటి జడ విగ్గులు

గోపికమ్మ గుర్తులు

మన గొబ్బెమ్మలు.

అంబికమ్మ గుర్తులు

మన చెల్లెమ్మలు.

కనిపించే పరమాత్మ జ్యోతి

మకర జ్యోతి.

దర్శించే ఆత్మ జ్యోతి

జ్ఞాన వికాస జ్యోతి.

ఇదే సకలకాంతులను

తెచ్చే మన సంక్రాంతి.

ఇదే సమస్తకోటి

మెచ్చే మన జీవనకాంతి.

కోటం త్రిశూల్

85230 05678

Next Story