కొత్త కార్డుల పంపిణీ ఎప్పుడు?

by Disha edit |
కొత్త కార్డుల పంపిణీ ఎప్పుడు?
X

రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులను సూచించేది రేషన్ కార్డులే. వాటి సంఖ్యనే ఆ పథకం అమలుకు కొలమానంగా తీసుకుంటారు. అంత ప్రాముఖ్యమున్న రేషన్ కార్డులని తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటివరకు కొత్తవి అందించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి కొత్త రేషన్ కార్డులను కిరణ్ కుమార్ రెడ్డి జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు నూతన కార్డులు పంపిణీ చేయకపోవడంతో లబ్దిదారులు చాలా అవస్థలు పడుతున్నారు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు కలవారు కొత్తగా పెళ్లి చేసుకుని, వేరు కాపురాలు ఉంటున్నవారు, పిల్లలు కలిగిన దంపతులు కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డుల నమోదుకు అవకాశం లేకపోవడంతో వీరి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిరుపేద, మధ్యతరగతికి చెందినవారు, రెక్కాడితే డొక్కాడని ప్రజలు కొన్ని లక్షల మందికి రేషన్ బియ్యం అందక సతమతం అవుతున్నారు. కావున ప్రభుత్వం రేషన్ కార్డులకు అర్హులయ్యే వారిని, లబ్ధిదారులను త్వరితంగా గుర్తించి వారికి రేషన్ కార్డుల ద్వారా అందించే ప్రయోజనాలు కల్పించి వారికి ఉపశమనం కలిగిస్తే, అర్ధాకలితో అలమటిస్తున్న కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే సంక్షేమ పథకాల అమలు సమర్థవంతంగా పనిచేసేందుకు రేషన్ కార్డుల జారీ ఎంతో ఉపయోగపడి కొన్ని లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.

పసుల స్వామి

96528 72885



Next Story

Most Viewed