- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు బ్యాంకు రాజకీయాల బారిన పడ్డ దేశ భద్రత.. దేశ సమైక్యతకు నూతన హెచ్చరిక!
ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన మరోసారి భారతదేశ భద్రతా వ్యవస్థల

ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన మరోసారి భారతదేశ భద్రతా వ్యవస్థల లోపాలను వెలుగులోకి తెచ్చింది. స్వాతంత్ర్యానంతర చరిత్రలో మతాధారిత విభజనల వలన, ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రాబల్యం వల్ల ఉగ్రవాదం భారతదేశంలో పునరావృతం అవుతూనే ఉంది. దేశ సమైక్యత, సార్వభౌమాధి కారం, భద్రత వంటి అంశాలు ఇప్పుడు పక్కకు పడిపోతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో ‘ఈ దేశం నాది’ అనే భావన పునరుద్ధరించుకోవాలి.
భారతదేశం చవి చూసినన్ని తీవ్రవాద దాడులను ప్రపంచంలో మరే దేశం ఎదుర్కోలేదంటే అతిశయోక్తి కాదేమో! స్వాతంత్రోద్యమ తర్వాతి చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. దేశాన్ని మతం ఆధారంగా విభజన చేయాలని విభజన శక్తులు 1946లో 'డైరెక్ట్ యాక్షన్' పిలుపుతో సృష్టించిన నరమేధం ఈ దేశంలో సంభవించిన మొదటి మత ఉగ్రవాద దాడిగా పరిగణించాలి. అసలు భారత దేశంలో తీవ్రవాద దాడులు ఎందుకు జరుగుతున్నాయి?
శాంతిభద్రతలు అప్రధానంగా మారడంతో..
దేశంలోని ఓటు బ్యాంకు రాజకీయాలు, కులవాద రాజకీయాలు, కుల రిజర్వేషన్లు, ఉచిత హామీల పథకాలు, దోపిడీ తత్వం ప్రధమ ప్రాధాన్యతలో చేరిపోయాయి. దేశ సమైక్యత, సమగ్రత, దేశ సార్వభౌమాధికారం, శాంతి భద్ర తలు అప్రధాన విషయాలుగా మారిపోయాయి. తీవ్ర వాద కార్యకలాపాలలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షిస్తే వారికి సంబంధించిన అనుయాయులు ఎక్కడ బాధపడతారో అనే మానసిక దౌర్బల్యం బీజేపేతర ప్రతిపక్ష నాయకులను పట్టి పీడిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో, కశ్మీర్ వేర్పాటువాద నాయకులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కలిసి ఆ లోయలో సృష్టించిన మారణ హోమం భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయం! ఆ లోయలో ఏర్పడిన భయంకరమైన పరిస్థితులను తట్టుకోలేక మూడు లక్షల మంది కశ్మీరీ హిందువులు అక్కడి నుంచి పారిపోయి వచ్చి కాందిశీ కులుగా బతుకుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీ సమాజానికి చెందిన ప్రజలు కాందిశీకులుగా బతకడం ఒక వైచిత్రి. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఏ దేశంలో కూడా సంభవించదు! మేధావులమని చెప్పుకునే వారికి పాలస్తీనా ముస్లింల కష్టాలు కనబడతాయి కానీ కశ్మీరీ కాందిశీకుల కడగండ్లు కనిపించవు.
ప్రమాదకర పరిస్థితుల్లో దేశం..
దేశంలో అనేక చోట్ల భారీ ఉగ్రదాడికి పాల్పడాలని ప్రయత్నించిన ఎనిమిది మందిని నిఘా వర్గాలు అరెస్టు చేయడం, వారి నుండి 2009 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం దేశ ప్రజలను భయకంపితులను చేసింది. అరెస్టయిన ఎనిమిది మందిలో నలుగురు డాక్టర్లు ఉండడం, ఆ నలుగురు డాక్టర్లలో ఒక మహిళ ఉండడం బట్టి చూస్తే, దేశం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో అర్థమవుతుంది. ఈ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు ఈ దేశంలోని రాజకీయ నాయకులు, కొన్ని జాతి వ్యతిరేక సంస్థల ప్రతినిధులు ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఎలా అందిస్తున్నారో కొన్ని సంఘటనలు పరిశీలిస్తే అర్థమవుతుంది. ఢిల్లీ బాట్లా ఎన్కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంఘీభావం తెలపడం, పార్లమెంటుపై దాడి కేసులో నిందితులైన దోషులకు శిక్షను ఆపించడానికి భారత సుప్రీంకోర్టును అర్థరాత్రి తెరవడం, ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితు లను కాపాడడానికి రిటైర్ అయిన ఒరిస్సా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మురళీధరన్‌ని అడ్వకేట్‌గా నియ మించి, దోషులను విడిపించడం, తాజ్ హోటల్ దాడి జరుగుతున్న సమయంలో స్పెషల్ కమాండోలను సరైన సమయంలో దించకుండా కేంద్ర హోం శాఖ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడడం ఇందుకు కొన్ని తార్కాణాలు.
ప్రజల్లో ఈ భావన రావాలి..!
తీవ్రవాద కార్యకలాపాల వల్ల దేశానికి ఎలాంటి నష్టం జరుగుతుందో దేశ ప్రజలకు వివరించడంలో జాతీయ వాదులమని చెప్పుకునే వారిలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, వ్యూహం లేదని ఒప్పుకోవాలి. ప్రతీ తీవ్రవాద సంఘటనకు పాకిస్తాన్ కారణమని చెప్పడం వీరికి పరిపాటి అయింది. ఇందుకు వాస్తవమైన కారణాలను వెదికి దేశ ప్రజలకు వివరించాలి. దేశ ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయ త్నాలు చేయాలి. ఇక చివరగా దేశ భద్రతకు, దేశ సమగ్రతకు, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకునే పాలన వ్యవస్థ, అందుకు సహకరించే న్యాయవ్యవస్థ ఈ దేశంలో ఏర్పడనంత వరకు ఢిల్లీ పేలుళ్ల లాంటి సంఘటనలు ఈ దేశంలో జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వ్యవస్థలు ఏర్పడాలంటే ఈ దేశ ప్రజలలో 'ఈ దేశం నాది' అనే భావన నిర్మాణం కావలసిన అవసరం ఎంతైన ఉంది!
-ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
94417 37877






