- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రక్షణ.. మాటలేనా?
ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన నేపథ్యంలో మహిళలు, చిన్నారుల భద్రతపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులపై పెరుగుతున్న లైంగిక నేరాలు, మహిళా రక్షణ చర్యలు, పొక్సో చట్టం అమలు, నేరస్థులపై కఠిన చర్యలు అవసరం.

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను ఏ ప్రభుత్యం కూడా అడ్డుకట్ట వేయలేకపోతుంది. మా ప్రభుత్యం అధికారంలోకి వస్తే మహిళ భద్రతే మా మొదటి ప్రాధాన్యత అని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మహిళా సంరక్షణ గురించి పట్టించుకోవడం లేదు. 60 ఏళ్ల మహిళల నుండి 3 ఏళ్ల పసిపిల్లల వరకు ప్రతిరోజూ ఏదో ఒక చోట అఘాయిత్యాలు, అత్యాచారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఖమ్మం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సంఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని కుదిపేసింది. వేసవి సెలవులకు వచ్చిన బాలికపై మొహమ్మద్ గౌస్ అనే వ్యక్తి లైంగిక దాడి చేసి, తన తప్పు బయట పడుతుందని భవనంపై నుండి ఆ బాలికను కిందకు తోసేసాడు. ఆ చిన్నారి ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఇంకా లోకజ్ఞానం తెలియని 12 ఏళ్ల పసి బాలికపై అత్యాచారం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు స్పందించకపోవడం బాధాకరం. పాఠశాలకు పోవాల్సిన పాప ఇలా హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ గదిలో ప్రాణాల కోసం కొట్టు మిట్టాడుతోంది, దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యమా? లేదా భద్రత లేని సమాజంలో ఆడపిల్లలా పుట్టి నందుకా? పార్టీ మద్దతు కోసం డిబేట్‌లల్లో గంటల తరబడి మాట్లాడే యాక్టివిస్టులు, మహిళా సంఘాల పేరుతో తిరిగే నాయకులు ఈ ఘటనపై ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? ఇలాంటి ఘటనలు నిర్మూలించడానికి పొక్సో లాంటి చట్టాలను తీసుకువచ్చినా ఇంకా ఇలాంటి దాడులు జరుగుతూ ఉండడం చాలా బాధాకరం. ఎవరు ఊహించని విధంగా, కఠినమైన నిర్ణయాలతో పొక్సో చట్టంలో మార్పులు తీసుకురావాలి. అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిన "మున్ముందు నా జీవితం అధోగతి" అవుతుందనే భయం ప్రతి సామాన్యుడిలో భయం కలిగేలాగా ఉండాలి. నామమాత్రంగా ఉన్నా షీ టీమ్స్ ఇప్పటికైనా మహిళా సంరక్షణ కోసం పని చేయాలి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుడు మహమ్మద్ గౌస్‌పై కఠిన చర్యలు తీసుకొని ఉరిశిక్ష వేయాలనీ డిమాండ్ చేయడం జరుగుతుంది.
- నీతు సింగ్,
ఏబీవీపీ
96180 62002






