- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క సబ్జెక్ట్ ఫెయిలైతే.. రెండు సబ్జెక్టులు చదవాలా?
10వ తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు కూడా విడుదలయ్యాయి. జూన్ 3వ తేదీ నుండి అడ్వాన్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి

10వ తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు కూడా విడుదలయ్యాయి. జూన్ 3వ తేదీ నుండి అడ్వాన్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి ఇప్పటికే షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. అయితే అన్ని సబ్జెక్టుల మాట ఎలా ఉన్నా సైన్స్ సబ్జెక్టులో ఫెలయిన విద్యార్థుల బాధ వర్ణనాతీతం. రెండు సబ్జెక్టులు చదవడానికి సమయం సరిపోక చదవలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం సైన్స్ సబ్జెక్టును భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్రం అను రెండు భాగాలుగా విభజించింది. రెండు వేరు వేరు పాఠ్య పుస్తకాలు. ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా నియమింపబడిన స్కూల్ అసిస్టెంట్‌లు బోధిస్తున్నారు. ప్రభుత్వం రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తోంది. మూల్యాంకనం కూడా వేరువేరుగా నిర్వహిస్తుంది. కానీ ఫలితాలు ప్రకటించే సమయంలో రెండు సబ్జెక్టులను కలిపి మార్కులను ప్రకటించడం వల్ల ఫెయిలైన విద్యార్థులు తాము భౌతిక, రసాయన శాస్త్రంలో, జీవ శాస్త్రంలో వేటిలో ఫెయిలయ్యామా తెలియక సప్లిమెంటరీ పరీక్షలకు మళ్లీ రెండు సబ్జెక్టులకు సన్నద్ధమవ్వడం తమ పిల్లలకు తలనొప్పిగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఫెయిలయ్యారో ఫలితాల్లో సూచిస్తూ తప్పిన పరీక్షకు మాత్రమే రాయడానికి అనుమతిస్తే విద్యార్థుల సమయం వృథా కాకుండా ఉంటుంది. ఉదాహరణకు ఫిజికల్ సైన్స్‌లో విద్యార్థికి 22 మార్కులు వచ్చి, 5 మార్కులు జీవశాస్త్రంలో పొంది ఉంటే సప్లిమెంటరీ పరీక్షలో కేవలం జీవశాస్త్రంలో పరీక్ష నిర్వహిస్తే సరిపోతుందనేది తల్లిదండ్రుల వాదన. అలా కాకుండా సంవత్సర కాలంలో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రంలోని 24 చాప్టర్లను కేవలం నెల రోజుల కాలంలో చదవడం తలకు మించిన భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న కొద్ది సమయంలో ఫెయిలైన సబ్జెక్ట్ మాత్రమే చదివి పాస్ అయ్యే అవకాశాన్ని కల్పించి విద్యా సంవత్సరం వృదా కాకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఆలోచించి విద్యార్థులకు సరైన న్యాయం చేస్తారని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
- సుధాకర్.ఏ.వి
90006 74747






