- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఏటా 10 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌పై నమ్మకంతో ఉన్నత విద్యాభ్యాసానికి ముందు కొచ్చి ప్రైవేట్ కాలేజీల్లో కోర్సులు పూర్తి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళితే ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యాలు కరాఖండిగా చెప్తున్నాయి. విశ్వవిద్యాలయాలు సైతం ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని తెలియజేస్తున్నాయి. దీనితో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుతెచ్చి మరీ కళాశాలలకు ఫీజులు చెల్లిస్తున్నారు, ఒకవైపు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నా సర్కారు మాత్రం ఆ బకాయిలను విడుదల చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ప్రభుత్వం గత విద్యా సంవత్సరానికి, సంబంధించి టోకెన్లు జారీ చేసి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు, యాజమాన్యాలు, విద్యార్థుల ఖాతాలలో నగదు జమ కాలేదు. దీనిపై విద్యార్థులు అధికారులను ప్రశ్నిస్తే, త్వరలోనే ఖాతాలో నగదు జమవుతుందని బదులిస్తున్నారు. కానీ కాకపోవడంతో విద్యార్థులు నెలల తరబడి సంక్షేమ శాఖ అధికారుల కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇక ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్‌లో ప్రభుత్వం ఉంచడంతో తాము కళాశాలలు నడిపే పరిస్థితిలో లేమని, అధ్యాపకులకు జీతభత్యాలు కూడా చెల్లించలేని దీన స్థితిలో ఉన్నామని మొరపెట్టుకుంటున్న వైనం ఏర్పడింది. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి.
-దేవేందర్ ముంజంపల్లి
89784 58611






