- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడబిడ్డా నీకు రక్షణ ఎక్కడ?
మహిళలకు అండగా రక్షణ కల్పించడానికి అనేక చట్టాలు, పోలీసులు, షీ టీమ్స్, ఉమెన్ కమిషన్, ఇన్ని రంగాలు పనిచేస్తున్నా

మహిళలకు అండగా రక్షణ కల్పించడానికి అనేక చట్టాలు, పోలీసులు, షీ టీమ్స్, ఉమెన్ కమిషన్, ఇన్ని రంగాలు పనిచేస్తున్నా రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. లోపం ఎక్కడుంది? ఒకవైపు మహిళా సాధికారతే ధ్యేయమంటూ మహిళల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి కానీ, మహిళల భద్రత విషయంలో ఎందుకు లోపాలు జరుగుతున్నాయి? రాష్ట్రంలో ఎందుకిలా వరుస దాడులు జరుగుతున్నాయి అనేది ప్రశ్నార్థకమై నిలుస్తోంది.
ఒకప్పుడు పని చేసే ప్రదేశంలో, ప్రయాణించే సమయంలో, అర్ధరాత్రి సమయాలలో, అమా నుష ప్రదేశాలలో ఎక్కడో ఆడబిడ్డల మీద లైంగిక వేధింపులు, ఆకతాయిలు అసభ్యరంగా ప్రవర్తించటం విన్నాం, చూశాం కానీ నేడు తల్లి ఒడి లాంటి సరస్వతి నిలయాల్లో ఆడబిడ్డలకు రక్షణ లేదు. ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థినులు అనుని త్యం ఏదో ఒక విద్యాలయంలో ఆకతాయి వేధింపులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆడబిడ్డల బతుకులు దిన దిన గండంగా మారాయి. ముక్కుపచ్చలారని పసి కందు నుండి మూడు కాళ్ల ముసలవ్వ వరకు కామాంధుల కామానికి బలైపోతున్నారు.
ప్రభుత్వాలు మారుతున్నా..!
గత బీఆర్ఎస్ పాలనలో చిన్నారి చైత్ర నుంచి వైద్యురాలు ప్రీతి వరకు అనేక అత్యాచారాలు వేధింపులతో ఎంతోమంది ఆడబిడ్డలు బల య్యారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పు డైనా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాలు ఘటనలకు అడ్డుకట్టపడుతుంది అనుకుంటే మార్పు లేదు. విద్యాసంస్థల్లోనే ఎక్కువ వేధింపులకు గురవుతున్నారు. మరో వైపు అనుమానాస్పద స్థితిలో విద్యాలయాల్లో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్న సంఘటనల పైన సరైన విచారణ లేదు. విద్యార్థినుల తల్లిదండ్రులకు న్యాయం జరిగింది లేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు.
ఆకతాయిలకు అడ్డూ, ఆదుపూ లేదా?
తెలంగాణలో కొన్ని వరుస ఘటనలు పరిశీలిస్తే, నిర్మల్ నుంచి బస్సులో ప్రయాణిస్తున్న మహిళ పైన అత్యాచారం, మలక్‌పేట్‌లో న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిపై అత్యాచారం, ఉప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఒకటో తరగతి విద్యార్థిని డాన్స్ మాస్టర్ అసభ్యకర ప్రవర్తన, ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుల్ హత్య ఘటన, సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ హాస్టల్‌లో ఆకతాయిలో చొరబడి అసభ్యకర ప్రవర్తన, వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ ఎంప్లా యర్‌పై అత్యాచారం, హైదరాబాద్‌లో రాపిడో ఎక్కిన యువతిపై అసభ్యకర ప్రవర్తన, మల్లేపల్లిలో ఆడపిల్లలను వేధిస్తున్న సంఘటన, ఈ మధ్యనే సీఎంఆర్ కళాశాలలో విద్యార్థినిల హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి న్యూడ్ వీడి యోస్ రికార్డ్ చేసిన సంఘటన, మహ బూబ్‌నగర్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు వాష్ రూమ్‌లలో సెల్ ఫోన్లతో వీడియోల చిత్రీకరణ, మొన్న ఇబ్రహీంపట్నం - మంగళపల్లిలో అర్ధరాత్రి ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఇలా ఒకటా రెండా... ఎక్కడో అర్ధరాత్రి రోడ్ల మీదనో, పార్కులలో, బస్సుల్లోనూ, అమానుష ప్రాంతాల్లో కాదు, తరగతిలో, హాస్టల్ నాలుగు గోడల మధ్యనే ఇన్ని అమానుష ఘటనలు జరుగుతుంటే ఇంకా ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంటుంది?
ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే?
అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళల్లో సత్తా చూపుతున్న ఈ తరుణంలో, మాకు రక్షణ కల్పించండి అని గోడువెళ్లబోస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. విద్య, వైద్య, న్యాయ, రక్షణ, పరిశ్రమలు అన్ని రంగాల్లో ఉన్న మహిళలకు రక్షణ లేకపోతే ఇక సాధారణ జీవితం గడిపే సామాన్య మహిళ ల పరిస్థితి ఏమిటి? ఇప్పటికైనా సమాజం ప్రభు త్వం కళ్లు తెరుస్తుందా? ఇకనైనా ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఆగు తాయా? తెలంగాణ ఆడబిడ్డా భవిష్యత్తు బ్రతుకు బాట ఎటువైపు? ఓ ఆడబిడ్డా నీకు రక్షణ ఎక్కడ?
చింతకాయల ఝాన్సీ
ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్
93819 21216






