- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భయం, బ్లాక్‌మెయిల్, డబ్బులు.. డిజిటల్ అరెస్టుల అసలు కథ!
దేశంలో డిజిటల్ అరెస్టుల అంశంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. దీనిపై ప్రజలకు ఎంత అవగాహన చేసినా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉంటున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్టు

దేశంలో డిజిటల్ అరెస్టుల అంశంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. దీనిపై ప్రజలకు ఎంత అవగాహన చేసినా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉంటున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్టు పేరుతో బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బెదిరించి ఏకంగా రూ.32 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు.. ఇటీవలి కాలంలో వెలుగు చూసిన అతిపెద్ద సైబర్ నేరంగా ఈ కేసును పోలీసులు భావిస్తున్నారు. వీడియో కాల్‌లో సీబీఐ అధికారులుగా నటిస్తూ, సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రూ. 32 కోట్లు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు పోలీసు వర్గాల కథనం.
వణికిస్తున్న ఫోన్ కాల్..
అమాయక ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు రకరకాల పద్దతులు ఎంచుకుంటూ ఉంటారు. అందులో భాగంగా సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న కొత్త పద్ధతే ఈ డిజిటల్ అరెస్టులు.. ఈ డిజిటల్ అరెస్టుల పేరు చెప్పి అవతలి వ్యక్తులను భయపెట్టి మోసం చేస్తున్నారు. టార్గెట్‌గా ఎంచుకున్న వారికి వీడియో కాల్ చేస్తారు. తమను తాము సీబీఐ అధికారులగానో లేక ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లగానో పరిచయం చేసుకుంటూ వీడియో కాల్ చేస్తారు. బెదిరింపులకు భయపడ్డ వారి దగ్గర నుంచి సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున డబ్బు కాజే స్తున్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. హర్యానాలోని అంబాలాకు చెందిన ఒక సీనియర్ సిటిజన్ ఫిర్యాదు ఆధారంగా సుమోటాగా సుప్రీంకోర్టు కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు పత్రాలతో బెదిరింపులు..
అంబాలాకు చెందిన 73 సంవత్సరాల ఒక మహిళ.. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఒక ఫిర్యాదు చేసింది. తనను డిజిటల్ అరెస్టు చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న ఒక పత్రాన్ని నేరగాళ్లు తనకు చూపించారని సదరు మహిళ పేర్కొన్నారు. కోటి రూపాయలు చెల్లిస్తే.. సదరు డిజిటల్ అరెస్టు నుంచి బయట పడేస్తామని సైబర్ నేరగాళ్లు హామీ కూడా ఇచ్చారని ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. కాగా న్యాయస్థానం ఆదేశాలు ఉన్నట్లు నేరగాళ్లు నకిలీ పత్రాలు సృష్టించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగ ణించింది. దీంతో సదరు ఫిర్యాదును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ మోసాలను సామాన్యమైన మోసాలుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ పరిగణించలేమని సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.
కనిపించని దొంగలు సైబర్ నేరస్తులు..
ఒకప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాల్లో దొంగలు చోరీలకు పాల్పడేవాళ్లు.. అలాగే రాత్రిళ్లు అందరూ నిద్రపోయాక ఇళ్లల్లోకి ప్రవేశించి దొంగతనాలు చేసేవాళ్లు.. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆన్‌లైన్ చోరీలు తెరమీదకు వచ్చాయి. ఫోన్ చేసి ఫలానా బ్యాంకు అధికారులమని పరిచయం చేసుకుంటారు. బ్యాంకు అకౌంట్ల అలాగే ఏటీఎం కార్డుల వివరాలు అడుగుతారు. అమా యక ప్రజలు ఇవన్నీ నమ్మి బోళాగా వివరాలు చెప్పేస్తారు. ఇంకేముంది కేటుగాళ్లు అందినకాడికి దోచుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు..
ప్రపంచవ్యాప్తంగా కేటుగాళ్లు ఇంటర్నెట్‌ను ఆధారం చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలన్నీ ఒకేలా ఉండవు. ఒక్కో నేరంలో ఒక్కో స్థాయి తీవ్రత ఉంటుంది. దీంతో సైబర్ క్రైమ్‌లను చూసి ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. రోజురోజుకూ సైబర్ నేరాల తీవ్రత ఊహిం చనంత వేగంగా విస్తరిస్తోంది. ఏమైనా సైబర్ నేరాల పట్ల జనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది.
- ఎస్. అబ్దుల్ ఖాలిక్,
63001 74320






