Christmas: క్రిస్మస్ చెట్టు వెనకున్న కథలేంటో తెలుసా?

by Disha edit |
Christmas: క్రిస్మస్ చెట్టు వెనకున్న కథలేంటో తెలుసా?
X

దేవదూత ఈ విషయం గొర్రెల కాపరులకు చెబుతుండగానే ఆ ప్రాంతమంతా పరలోకం నుంచి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వచ్చిన దేవదూతలు భగవంతుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ అదృశ్యమయ్యారు. కాపరులు దేవదూత చెప్పిన గొర్రెల దొడ్డి వద్దకు పరుగెత్తారు. అక్కడ మేరీ, జోసెఫ్‌‌ను తొట్టిలో పడి ఉన్న శిశువును చూశారు. దేవదూత చెప్పిన విషయాలను సహచరులందరికీ చేరవేశారు. రెండు వేల సంవత్సరాల క్రితం యేసు డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 గంటల సమయంలో పుట్టాడు. అందుకే డిసెంబర్ 25 న యేసు జన్మదినం క్రిస్మస్ జరుపుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ పండుగను క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు. యేసుక్రీస్తు(jesus christ) జన్మించి నేటికి రెండు వేల సంవత్సరాలు గడిచాయి. భక్తుల నుంచి ఆయన అనంత కరుణామయుడిగా, అపార కృపాశీలుడిగా, లోక రక్షకుడిగా, ప్రపంచ శాంతి దూతగా ఆరాధనలు అందుకుంటున్నాడు. రోమన్ సామ్రాజ్యంలోని నజరేత్ నగరంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. ఒక రోజు మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనిపించి 'ఓ మేరీ! నీవు దేవునిచే ఆశీర్వదించడినావు. కావున నీవు కన్యగానే ఉన్నా గర్భం దాల్చి కొడుకును కంటావు. నీబిడ్డకు యేసు(jesus) అని పేరు పెట్టు. అతడు దేవుడి కుమారుడు' అని చెప్పాడు. దేవదూత చెప్పినట్లే మేరీ గర్భం దాల్చి కొడుకును కనింది. ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు అని అర్థం.

మేరీ గర్భం దాల్చిన విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి అతనికి సైతం కలలో దేవదూత కనిపించి 'మేరీని పెళ్లిచేసుకో, ఆమె దేవుడి దీవెనలతో గర్భవతి అయ్యింది. ఆమెకు పుట్టినది దేవుడి కొడుకు. తనను నమ్ముకున్న ప్రజలందరినీ పాపాల నుంచి రక్షిస్తాడు' అని చెబుతాడు. దీంతో జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు.

వీరి వివాహం జరిగిన కొన్ని రోజులకు రోమన్ సామ్రాజ్య పాలకుడు ఆగస్టస్ సీజర్ తన రాజ్య జనాభాను లెక్కించడానికి సులభంగా ఉండేందుకు వీలుగా ప్రజలందరినీ డిసెంబర్ 25 లోగా స్వగ్రామాలకు చేరుకోవాలని ఆదేశించాడు. రాజు ఆజ్ఞను అనుసరించి, జోసెఫ్, మేరీ కూడా వారి స్వస్థలమైన బెత్లెహేముకు(bethlehem) బయలుదేరారు. తీరా అక్కడికి చేరుకునే సరికి ఆమెకు వసతి దొరకలేదు. చివరకు ఒక సత్ర యజమాని తన గోశాలలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే మేరీ యేసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఊరి పక్కనే ఉన్న పొలాలలో కొందరు గొర్రెల మందకు కాపలా కాస్తున్నారు. ఆ సమయంలో ఒక దేవదూత ఆకాశం నుండి దిగివచ్చి వారి ఎదురుగా నిలబడినాడు. దేవదూత రావడంతో చుట్టూ కాంతి వ్యాపించింది. దీంతో గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వారితో 'భయపడకండి, మీకు శుభవార్త చెప్పడానికే నేను ఇక్కడకు వచ్చానని' అంటాడు.

'ఈ రోజు బెత్లెహేములోని ఒక తొట్టిలో మీ అందరికీ ప్రభువు అయిన లోక రక్షకుడు జన్మించాడు. ఒక పసికందును బట్టలతో చుట్టి, తల్లి కడుపులో తొట్టిలో పడుకోబెట్టారు. ఇవే మీకు సంకేతాలు. ఆయనే లోక రక్షకుడు' అని దేవదూత వారికి వివరించాడు. దేవదూత ఈ విషయం గొర్రెల కాపరులకు చెబుతుండగానే ఆ ప్రాంతమంతా పరలోకం నుంచి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వచ్చిన దేవదూతలు భగవంతుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ అదృశ్యమయ్యారు. కాపరులు దేవదూత చెప్పిన గొర్రెల దొడ్డి వద్దకు పరుగెత్తారు. అక్కడ మేరీ, జోసెఫ్‌‌ను తొట్టిలో పడి ఉన్న శిశువును చూశారు. దేవదూత చెప్పిన విషయాలను సహచరులందరికీ చేరవేశారు. రెండు వేల సంవత్సరాల క్రితం యేసు డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 గంటల సమయంలో పుట్టాడు. అందుకే డిసెంబర్ 25 న యేసు జన్మదినం క్రిస్మస్ జరుపుకుంటారు.

క్రిస్మస్ చెట్టు వెనుక కథలు

చాలా సంవత్సరాల క్రితం క్రీస్తు పుట్టిన రోజున ప్రజలు చర్చికి వెళ్లి ఏదో ఒక రకమైన బహుమతి ఇచ్చేవారు. ఒకరోజు ప్లాబో అనే బాలుడికి పేదరికం కారణంగా ఏమి ఇవ్వాలో తోచలేదు. తనకు కనిపించిన ఒక అందమైన మొక్కను తీసుకొని చర్చిలో క్రీస్తు ముందు ఉంచాడు. కొద్దిసేపటికే ఆ చిన్న మొక్క అందరి ముందు ఏపుగా పెరిగి బంగారు రంగు సంతరించుకుంది. దీంతో అక్కడున్న వారంతా కానుకను సహృదయంతో ఇవ్వడమే ప్రధానమని తెలుసుకున్నారు. అప్పటి నుంచి అప్పటి నుంచి యేటా క్రిస్మస్‌ చెట్టును(christamas tree) అలంకరించడం ఆనవాయితీగా మారింది. మరో కథనం ప్రకారం క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలో సెయింట్‌ బోనీఫస్‌ సువార్త సేవల కోసం జర్మనీకి వెళ్లారు. అక్కడి ఆదివాసులు ఓక్‌ చెట్టుకు పూజలు చేసి సంబరాలు జరుపుకునేవారు.

ఆ చెట్టును దైవ సమానంగా భావించి నరబలి కూడా ఇచ్చేవారు. ఈ బలి బోనీఫస్‌ను అమితంగా బాధించింది. అందుకే ఆ దురాచారాన్ని రూపుమాపాలనుకొని ఆదివాసులకు ఇలా నరబలి తప్పని నచ్చజెప్పారు. క్రీస్తు వైపునకు దారిని చూపించే ఫర్‌ చెట్టును పూజించాల్సిందిగా సూయించారు. ఇలా మనుషులు చేసే పాపాల నుంచి విముక్తులను చేయడానికి యేసు శిలువ ఎక్కారని ఉపదేశించారు. ఈ చెట్టు కొమ్మలను ఇళ్లకు తీసుకెళ్లి అందంగా అలంకరించి ఆనందంగా పండుగ చేసుకోమని ఆదేశించారు. అప్పటి నుంచి క్రిస్మస్‌ పండుగ రోజున ఫర్‌ చెట్టును అలంకరించడం ఆనవాయితీగా మారింది

కోట దామోదర్

9391480475

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

మరోకోణం: వారి త్యాగాలను గౌరవిద్దాం!


Next Story