- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశభక్తి మేళవించిన స్పై థ్రిల్లర్ ధురంధర్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గూఢచారి కథలకు ఎప్పు డూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దేశభక్తి, సాహసోపేతమైన పోరాటాలు, ఉత్కంఠ రేకెత్తించే మలుపులు ప్రేక్షకులను థియే టర్లకు రప్పిస్తాయి..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గూఢచారి కథలకు ఎప్పు డూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దేశభక్తి, సాహసోపేతమైన పోరాటాలు, ఉత్కంఠ రేకెత్తించే మలుపులు ప్రేక్షకులను థియే టర్లకు రప్పిస్తాయి.. ఈ కోవలోనే దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిచింది. ‘URI’ సినిమాతో తన సత్తా చాటిన ఆదిత్య ధర్, వాస్తవ సంఘట నల నుంచి స్ఫూర్తి పొంది, కల్పిత అంశాలను జోడించి వెబ్ సిరిస్‌లా ఉత్కంఠ రేకెత్తించేలా ఈ చిత్రం రూపోదించారు..
కథా నేపథ్యం..
సినిమా 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ సంఘటనతో మొదలవుతుంది. ఈ సంఘటన దేశ భద్రతా వ్యవస్థలో ఎలాంటి మార్పులకు దారి తీసిందో దర్శకుడు చాలా స్పష్టంగా చూపించారు.. ఆ తర్వాత 2001లో జరిగిన పార్లమెంట్ దాడి కథను మరో మలుపు తిప్పుతుంది. దేశంపై నిరంతరం జరుగుతున్న ఉగ్రదాడులకు మూలమైన శక్తులను అంతం చేయడానికి ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ 'ఆప రేషన్ ధురంధర్' అనే సిక్రెట్ మిషన్‌ను ప్రతిపాదిస్తారు. ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం పాకిస్తాన్ లోపలికి వెళ్లి, అక్కడి ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛిన్నాభిన్నం చేయడం. దీని కోసం ‘హంజా అలీ మజారీ’ను ఎంపిక చేస్తారు.. హంజా పాకిస్తాన్ ఎలా వెళతాడు.. బెలూచ్ ప్రాంతంలో నేరస్థుడు రెహమాన్ డకైత్ ల్యారీ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఎలా చేరి ఒక కీలకమైన వ్యక్తిగా హంజా ఎలా ఎదిగాడో దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు..
కథా గమనం - స్క్రీన్ ప్లే
ఇక 26/11 ముంబై దాడులకు వాడిన ఆయుధాలు రెహమాన్ డకైత్ సరఫరా చేసినవే అని హంజా తెలుసుకున్నప్పుడు, కథలో తీవ్రత పరాకాష్టకు చేరుతుంది. దేశద్రోహులు ఎక్కడో లేరు మన దేశంలోనే ఉన్నారని చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే నకిలీ కరెన్సీ ముద్రణ ప్లేట్స్, కరెన్సీ పేపర్స్ అంశం చాలా అసక్తికరంగాను, సమస్య మూలాన్ని తెలియ జేస్తుంది. సినిమా నిడివి సుమారు మూడున్నర గంటలు ఉండటం, చాప్టర్స్‌గా విభజించడం వెబ్ సిరిస్‌లా అనిపించినా, కథలోని వేగం ఆ లోటును భర్తీ చేస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో స్పై జానర్‌లో కథ ఎలా ఉండాలో చూపించారు.. హంజా, యేలీనాల మధ్య వచ్చే ప్రేమకథ కథా గమనాన్ని కాస్త నెమ్మది చేసినా, అది హంజా పాత్రలోని మానవీయ కోణాన్ని ఆవిష్క రిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లి, సీక్వెల్ కోసం భారీ అంచనాలను పెంచుతుంది.
ఓటీటీ విడుదల - వివాదాలు..
థియేటర్లలో విజయవంతంగా ఆడిన తర్వాత ధురంధర్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అయితే ఓటీటీ వెర్షన్ విషయంలో కొన్ని వివాదాలు రేగాయి.. థియేటర్లలో 3 గంటల 34 నిమిషాలు ఉన్న సినిమా, ఓటీటీలో 9 నిమిషాలు తగ్గించారు. దర్శకుడి ప్రమేయం లేకుండానే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈ కట్స్ చేసిందని కొన్ని వార్తలు రాగా, మేకర్స్ దాన్ని ఖండించారు. సెన్సార్ బోర్డు నిబంధనలు, ఐబీ మినిస్ట్రీ కొత్త రూల్స్ ప్రకారం కొన్ని పదాలను మ్యూట్ చేయడం, హింసాత్మక దృశ్యాలను తగ్గించడం జరిగింది.
సీక్వెల్ అంచనాలు..
సినిమా చివరలో వచ్చే అబ్ బిగడ్నే కా వక్త్ ఆ గయా హై అనే డైలాగ్ సీక్వెల్ పై అంచనాలను శిఖరానికి చేర్చింది. 'ధురంధర్ ది రివెంజ్' పేరుతో రానున్న ఈ రెండో భాగం 2026 మార్చి 19న విడుదల కానుంది. రెండో భాగం మొదటి భాగం కంటే మరింత వైల్డ్‌గా, మరింత ఉత్కంఠగా ఉండబోతోందని చిత్ర బృందం ఇప్పటికే హింట్ ఇచ్చింది. మాతృభూమి రక్షణలో ప్రాణత్యాగం చేసే గూఢచారుల వీరగాథకు, ఉత్కంఠభరితమైన స్పై డ్రామాలను కోరుకునే ప్రేక్షకులకు ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఈ కథా క్రమంలో తదుపరి పోరాటం ఎలా ఉండబో తోందన్న ఉత్సుకత అందరిలోనూ నెలకొంది.
-డా. కట్కూరి
న్యాయ నిపుణులు






