- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధురంధర్.. సరికొత్త కల్ట్ మూవీ
చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్ద వసూళ్లు రాబట్టవచ్చు, కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులో ఒక బలమైన ముద్ర వేస్తాయి. ఫిల్మ్ మేకింగ్ లోని ఆర్ట్ & క్రాఫ్ట్ ప్రమాణాలను పెంచే ప్రయత్నం చేస్తాయి.. వాటి మీద రకరకాల అభిప్రాయాలకి, వాదనలకు ఒక స్కోప్ కల్పిస్తాయి. వాటినే కల్ట్ ఫిలిమ్స్ అంటారు.

చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్ద వసూళ్లు రాబట్టవచ్చు, కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులో ఒక బలమైన ముద్ర వేస్తాయి. ఫిల్మ్ మేకింగ్ లోని ఆర్ట్ & క్రాఫ్ట్ ప్రమాణాలను పెంచే ప్రయత్నం చేస్తాయి.. వాటి మీద రకరకాల అభిప్రాయాలకి, వాదనలకు ఒక స్కోప్ కల్పిస్తాయి. వాటినే కల్ట్ ఫిలిమ్స్ అంటారు. అలాంటి కల్ట్ సినిమా.
ఒక సినిమా నచ్చడం నచ్చకపోవడం సబ్జెక్టివ్ విషయం. పర్సనల్ టేస్ట్ బట్టి, వ్యక్తిగత, సామాజిక, రాజకీయ అవ గాహన బట్టి ఉంటుంది. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని రూలేం లేదు. సాధారణంగా మేధావులు దేశం మీదో, సమాజం మీదో ఒక పొగ్రేసివ్ థాట్‌తో ఉంటారు. అందరికీ నచ్చిన సినిమాలో కూడా సమాజానికి చెడు చేసే ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అది ఎంత పెద్ద సక్సెస్ అయినా విమర్శిస్తారు.. జనానికి ఏమాత్రం నచ్చని సినిమాని కాస్త ప్రొగ్రెసివ్‌గా ఉంటే నెత్తిన పెట్టుకుంటారు.. కానీ అన్నిసార్లు ఇదే రూల్ అప్లై అవుతుందనుకోవడం పొరపాటు. ధురంధర్ సక్సెస్‌కి కారణం ప్రాపగాండానో, అతి దేశభక్తో, ఒక వర్గం పట్ల ద్వేషమో కారణం అనడం జనాన్ని మిస్ లీడింగ్ చేయడమే..
కోట్లమందిని కదిలించిన చిత్రం..
ధురంధర్ మొత్తం నిడివి 3.45 గంటల పైనే. సినిమాలో వాళ్లు చెబుతున్న ఛాయలున్న సీన్లు, సంభాషణలు (అవి అభ్యంతరకరమా అనేది కూడా సబ్జెక్టివే) అయిదారు చోట్ల కనిపిస్తాయి. వాటన్నిటినీ ఎడిట్ చేసి ఒక సీక్వెన్స్‌లో పెడితే మొత్తం కలిపి కనీసం 3 నిమిషాల నిడివి కూడా ఉండదు. ఓ మూడు నిమిషాల నిడివి కోసం, 200 ఖర్చు పెట్టుకుని, థియేటరుకెళ్లే శ్రమని భరించి మిగతా 3.40 నిడివిని భరించేంత దేశ ప్రేమికులు, ద్వేష ప్రేమికులు ఇన్ని కోట్లమంది ఉన్నారా? అనేది నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్లు ఆలోచించుకోవాలి.
ఈ సినిమా చూసేది విద్వేష మూఢులేనా?
ధురంధర్ ₹1,300 కోట్లకు పైగా థియేట్రికల్ వసూళ్లు (ఓవర్సీస్ కలుపుకుని) సాధించి కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, ఒక 'కల్ట్ ఫినామెనా'గా అవతరించింది. ఇండియాలో టికెట్ ధర ₹100–₹350, ఓవ ర్సీస్‌లో ₹850–₹1,500 ఉంటాయి. సగటున టికెట్ రేటు 300 అనుకుంటే థియేటర్‌కు వచ్చిన వారు సుమారు 4.33 కోట్లు మేర ఉంటారు.. అదే టికెట్ రేటు 200 అనుకుంటే 6.5 కోట్ల మంది ఈ సినిమా చూశారు. అన్ని కోట్లమంది ప్రేక్షకుల్లో ఒక పార్టీకో, ఒక రాజకీయ ఐడియాలజీకో, ఒక వర్గానికో, అనుకూలంగానైనా వ్యతిరేకంగానైనా ఎంతమంది ఉంటారు? అంతకంటే ఎక్కువ న్యూట్రల్ ప్రేక్షకులు, సినిమాను సినిమాగా ఇష్టపడే వాళ్లు కూడా ఉంటారు కదా! కోట్లాది ప్రేక్షకుల సెన్సిబిలిటీస్‌ని కించపరుస్తూ వాళ్లని అతి దేశభక్తులుగానో, విద్వేష మూఢులుగానో బ్రాండింగ్ చేయడం... అన్నిటికంటే పెద్ద పక్షపాత వ్యాఖ్యానం, సృజనాత్మక ద్రోహం.
ఫిల్మ్ మేకింగ్‌కి సరికొత్త నిర్వచనం..
ఫిల్మ్ మేకింగుకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంటుల్లోనూ ధురంధర్ కొత్త ప్రమాణాలు సెట్ చేయడమే ఈ విజయానికి ప్రధాన కారణం. ఇందులోని ప్రతీ పాత్రకి ఒక Existence, Root & Ground ఉంది. మిగతా స్పై థ్రిల్లర్లతో పోలిస్తే ఏ రకంగా చూసినా విభిన్నమైన సినిమా. హీరో అచ్చమైన మంచివాడేం కాదు. 'గ్రే' ఏరియాలో ఉంటాడు. పరిస్థితులు అతన్ని నడిపిస్తున్నాయా? అతను పరిస్థితులను వాడుకుంటున్నాడా? అనే సందిగ్ధత చివరి దాకా వెంటాడుతుంది. ఇలాంటి కారెక్టరైజేషన్‌తో, ఈ జానర్‌లో ఎన్ని స్పై సినిమాలు వచ్చాయో చెప్పండి..
శిఖర స్థాయిలో ప్రొడక్షన్ డిజైనింగ్..
ఆదిత్య క్రియేట్ చేసింది ఒక అల్ట్రా రియలిస్టిక్ ట్రూ ఇండియన్ స్పై థ్రిల్లర్. అత్యంత సహజంగా తెరకెక్కించారు. కరాచీలోని లియారీ టౌన్ కోసం బ్యాంకాక్‌లో వేసిన సెట్ అయితే ఇండియన్ ప్రొడక్షన్ డిజైనింగ్‌ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లింది. మామూలుగా హై బడ్జెట్ స్పై థ్రిల్లర్లలో కనబడే హంగులు, ఆర్భాటాలు, అతిశయోక్తుల యాక్షన్ సీక్వెన్సులు ఇందులో ఒక్కటి కూడా లేదు.
ప్రేక్షకులను కదలనివ్వని సినిమా..
ధురంధర్ ఎందుకు కల్ట్ అంటే, ఇది ప్రేక్షకుడి మెప్పుకోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించాలని పాకులాడదు, ప్రేక్షకుడిని తనలో భాగస్వామిని చేసుకుంది. అంత సుదీర్ఘ నిడివి ఉన్నా కూడా థియేటర్లో ప్రేక్షకులు కదలలేదంటే, దాని ఆర్ట్ & క్రాఫ్ట్ బలం ఏంటో అర్థం చేసుకోవాలి. కొన్ని రియలిస్టిక్ సంఘటనల చుట్టూ అల్లిన కల్పిత కథ మధ్యలో ప్రేక్షకుడిని కూర్చోబెట్టి ఒక 'ఇమ్మర్సివ్ ఎఫెక్ట్' ఇవ్వగలగడమే ఇంతటి ఘన విజయానికి కారణం. ఆరున్నర కోట్ల ప్రేక్షకులందరినీ ఒక పార్టీ విధేయులుగానో, ప్రాపగాండా వాహకులుగానో, విద్వేషోన్ముఖులుగానో చిత్రించడం ప్రేక్షకుల సెన్సిబిలిటీనీ అవమానించడమే.
సినిమాలు చూడని మేధావుల విమర్శ..
ఒక సినిమా మీకు నచ్చలేదని చెప్పే హక్కు మీకు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇంతమందిని తక్కువ చేసి మీరేదో మేధావుల్లా ఫీల్ అయిపోయాయే హక్కు మాత్రం మీకు ఉందా? లేదా అనేది మీకు మీరు వేసుకోవాల్సిన సబ్జెక్టివ్ క్వశ్చనే. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా 26 మిలియన్ గంటల వాచింగ్ హవర్స్ సాధించి ఇంకో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఆఫీషియల్ లెక్కల ప్రకారం ఇది సుమారుగా 7 నుండి 7.5 మిలియన్ల ఫుల్ సినిమాకు వాచ్ హవర్స్‌కు సమానం..
- ఆర్. సామల
రచయిత, దర్శకుడు






