డీడీఎస్.. నమ్మకం కోల్పోయిందా?

by Ravi |   (  Updated:2026-06-28 00:30:25  IST  )

దళిత మహిళల సాధికారత, మిల్లెట్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి గుర్తింపు పొందిన డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ప్రస్తుతం పొదుపు నిధులు, భూముల విక్రయాలు, ఆర్థిక పారదర్శకతపై ఆరోపణలతో వివాదంలో చిక్కుకుంది. మహిళలు జవాబుదారీతనం, న్యాయం కోరుతున్నారు.

డీడీఎస్.. నమ్మకం కోల్పోయిందా?
X

సుస్థిర అభివృద్ధి, మహిళా సాధికారత, సాధికారత వారసత్వం కోసం నలభై వసంతాల కిందట బాస వేసిన ‘డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ’(డీడీఎస్) ఇప్పుడు అపనమ్మకంతో మునిగి‌పోయింది. దళిత మహిళలను శక్తివంతం చేయడానికి - మిల్లెట్ వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి, బంజరు భూములను తిరిగి పొందడం కోసం, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంపొందించడం ఒక ఉద్యమంగా ప్రారంభమైంది. ఇప్పుడు నమ్మక ద్రోహానికి, అపనమ్మకాన్ని కేర్ అఫ్ అడ్రస్‌గా మారింది. డీడీఎస్‌ను నిర్మించిన మహిళలే ఇప్పుడు తమ ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్నారు. మా పొదుపు సొమ్ము ఎక్కడ ఉంది? మన భూములను ఎవరు అమ్మారు? అని ప్రశ్నిస్తున్నారు. దివంగత పి.వి సతీష్ నాయకత్వంలో, డీడీఎస్ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. జర్మనీకి చెందిన బ్రోట్ ఫర్ డై వెల్ట్, కెనడాకు చెందిన ఇంటర్ పరేస్ వంటి ప్రపంచ దాతలచే నిధులు సమకూర్చబడిన డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ దళిత సాధికారత, మహిళా స్వాలంబన, ఆహార భద్రత, ఆహార న్యాయం అనే వాటికి పర్యాయ పదంగా మారింది. కానీ నేడు పొదుపులు లేకపోవడం, అనధికారిక భూమి అమ్మకాలు, ఆర్థిక అస్పష్టత వంటి ఆరోపణలు ఒకప్పుడు ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న మహిళలను నమ్మకద్రోహం చేసి నిట్ట నిలువునా ముంచేశారు. ఒకప్పుడు 28 అంతర్జాతీయ ఏజెన్సీల మద్దతుతో విరాజిల్లిన డీడీఎస్, ఇప్పుడు కేవలం నలుగురు దాతలపై మాత్రమే ఆధారపడుతుంది. డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ విజయాలు కాదనలేనివి. జహీరాబాద్ గ్రామాల్లో కుల అడ్డంకులను బద్దలు కొట్టింది. మిల్లెట్ వ్యవసాయం ఆహార సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించింది. కానీ పారదర్శకత క్షీణించినప్పుడు అత్యంత ప్రసిద్ధి చెందిన అట్టడుగు ఉద్యమాలు కూడా కూలిపోతాయి. ప్రస్తుతం డీడీఎస్ అస్తిత్వ ప్రశ్నను ఎదుర్కొం‌టుంది. అది తన నైతిక అధికారాన్ని తిరిగి పొందగలదా.. లేదా? అనేది ప్రశ్నర్థకం. ప్రస్తుతానికి, జహీరాబాద్ మహిళలు మాత్రం సానుభూతి కోసం ఎదురుచూడడం లేదు, జవాబుదారీతనం కోసం వేచి ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంస్థలు తక్షణమే జోక్యం చేసుకుని మహిళలకు న్యాయం చేయాలి.

- డా.ముచ్చుకోట సురేష్ బాబు,

99899 88912

Next Story