- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేనేతకు చేయూత
భారతదేశం చేనేతకు శతాబ్దాలుగా మహోన్నతమైన చరిత్ర ఉన్నది. మనదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి

భారతదేశం చేనేతకు శతాబ్దాలుగా మహోన్నతమైన చరిత్ర ఉన్నది. మనదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించిన వృత్తి చేనేత రంగం. విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ వస్త్ర నినాదం భారత స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోశాయి. మన చేనేత కార్మికులు తమ కళా నైపుణ్యంతో వస్త్రాలపై ఎన్నో కళలను ఆవిష్కరించి ప్రపంచాన్ని అబ్బురపరిచి చేనేత గొప్పతనాన్ని నలుదిక్కులు చాటారు.. ఇంతటి మహోన్నత చరిత్ర కలిగిన చేనేత పరిశ్రమ చేనేత కార్మికుల జీవితాలు నేడు కడు దయనీయంగా మారాయి. గత పాలకుల లోపభూయిష్ట విధానాల వలన అంధకారమైన చేనేత వృత్తి సంక్షోభంలో కూరుకుపోయి కార్మికులకు ఉపాధి కరువైంది. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలకు చేనేత కార్మికులు గురైన విషయం మనకు విదితమే. ఈ విపత్కర పరిణామాల నుండి చేనేత వృత్తిని కార్మికులను రక్షించడానికి నేటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా పాలన సర్కార్ నడుం బిగించింది.
చేనేతను ధ్వంసం చేసేలా..
గత ప్రభుత్వం గుజరాత్ సిల్క్ చీరలను సైతం బతుకమ్మ చేనేత చీరలని నమ్మబలికి తమ మంది మాగదులకు 2000 కోట్లు అప్పన్నంగా దోచిపెట్టింది. అలాగే కేంద్ర ప్రభుత్వం చేనేతను విధ్వంసం చేసేలా రూపొందించిన విధానాలను అమలు చేస్తున్నది. చేనేత రంగానికి కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకుండా చేనేత రిజర్వేషన్ చట్టంలోని ఉత్పత్తులకు మిల్లుల్లో అవకాశాలను కల్పిస్తున్నది. నేడు రాష్ట్రంలో మిల్లులపై తయారవుతున్న వస్త్రాలను అరి కట్టేందుకు చర్యలు తీసుకోకపోవడం చూస్తే బీజేపీకి చేనేతను విధ్వంసం చేసే ఆలోచనలు కనబడుతున్నాయి. చేనేత బోర్డును రద్దు చేయడం మహాత్మాగాంధీ బునకర్ యోజన, ఐసీఐసీఐ లాంబర్గ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, చేనేత కార్మికుల హౌస్ కం వర్క్ షెడ్ లాంటి పథకాలను రద్దు చేయడంతో పాటు చేనేత ముడి సరుకు అయిన యురాన్ పై 5%, రంగుల రసాయనాలపై 5 % నుండి 12% జీఎస్టీ విధించి చేనేత కార్మికులకు ముడి సరుకులు అందుబాటులోకి లేకుండా చేసింది. పైగా చేనేత పరిశ్రమ కార్మికులు, ఉపాధి సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మిల్లు రంగాలకే పెద్ద ఎత్తున నిధు లను కేటాయించి చేనేత విధ్వంసానికి పాల్పడుతుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలం గాణ రాష్ట్రంలోని చేనేత కార్మికుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని అపరిష్కతంగా ఉన్న నేతన్నల సంక్షేమాన్ని గట్టెక్కించే ప్రయత్నం మొదలుపెట్టారు. చేనేత పరి శ్రమ కార్మికుల ఉపాధి సంక్షేమ అభివృద్ధి బోర్డు, సంక్షేమ బోర్డుకు 2000 కోట్ల రూపాయల కేటా యింపు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాం డ్లూమ్ టెక్నాలజీ లాంటి సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారు. త్రిప్ట్ ఫండ్ పేరుతో నేతన్న పొదుపు పథకానికి బాకీ పడ్డ సుమారు 100 కోట్లు విడుదల చేశారు. చేనేత కార్మికులకు ఐదు లక్షల సాధారణ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటితో పాటు ప్రతి చేనేత కార్మికుడికి 5 లక్షల పెట్టుబడి సాయం, నూలు రంగుల సబ్సిడీ పథకం నగదు బదిలీ కొనసాగించాలి. ఆరోగ్య బీమా, చేనేత సహకార సంఘాలకు, టెస్కోకు ఎన్నికలు నిర్వహించాలి. అసెంబ్లీలో శాసనమండలిలో ప్రాతినిధ్యం లేని చేనేత (పద్మశాలి) వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
-పున్న కైలాష్ నేత
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
94921 87210






