ఫిన్‌లాండ్‌లో హైదరాబాద్‌ స్టూడెంట్ మిస్సింగ్

by Muthe.Rajitha |

ఉన్నత చదువుల కోసం ఫిన్‌లాండ్‌ వెళ్లిన హైదరాబాద్ విద్యార్ధి అదృశ్యం కావడం సంచలనం రేపింది.

ఫిన్‌లాండ్‌లో హైదరాబాద్‌ స్టూడెంట్ మిస్సింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉన్నత చదువుల కోసం ఫిన్‌లాండ్‌ వెళ్లిన హైదరాబాద్ విద్యార్ధి అదృశ్యం కావడం సంచలనం రేపింది. నగరంలోని వనస్థలిపురంలోని వైదేహినగర్‌లో నివాసముంటున్న మణిదీప్‌రెడ్డి, 2025 ఆగస్టు నెలలో M.Tech చదవడానికి ఫిన్‌లాండ్‌కు వెళ్లాడు. అక్కడ లతి (Lahti) పట్టణంలోని ప్రసిద్ధ ఎల్‌యూటీ (LUT) యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే గత నెల మే 5వ తేదీన అతను ఫిన్‌లాండ్ రాజధాని అయిన హెల్సింకి నగరానికి వెళ్లాడు. ఆ మరుసటి రోజు నుండి అతని మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్‌ వస్తుండటంతో కుటుంబ సభ్యులకు మణిదీప్‌రెడ్డి గురించి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. ఐదు రోజుల అనంతరం మే 11న అతని స్నేహితులు లతి పట్టణ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయినప్పటికీ, ఇప్పటివరకు ఆ విద్యార్థికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభించకపోవడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఫిన్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసి సహాయం కోరారు. అలాగే తమ కుమారుని ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Next Story