- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ రాజకీయాల్లో సినిమా తరహా ట్విస్ట్‌లు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా ఎదిగినా మెజారిటీకి కొద్దిదూరంలో ఆగిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ సాగుతున్న రాజకీయ ఉత్కంఠ, గవర్నర్ పాత్ర, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలపై కథనం.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ మంచి పనితీరు కనపరిచి, సర్కారు ఏర్పాటు చేసే దశకు వచ్చాక క్లైమాక్స్ సీన్ పలు మలుపులు తిరుగుతూ వస్తోంది. ఇంత భారీ క్లైమాక్స్ తర్వాత ఆయన హీరోగా వస్తారా? ఒక ప్రధాన పాత్రగా సరి పెట్టుకుంటారా? అన్నది ఊహించనలవి కావడం లేదు. అయితే ఇప్పటివరకూ ఆయన సోలో సూపర్ స్టార్‌గానే ఉన్నారు. తమిళనాడులో దశాబ్దాలుగా రెండు పార్టీలే అధికారాన్ని మార్చి మార్చి అందుకుంటున్నాయి. ఈసారి మూడో ప్రత్యామ్నాయంగా విజయ్ టీవీకే పార్టీ స్థాపించి, పొత్తుల్లేని సింగిల్ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసి, సంఖ్యాబలంలో అతి పెద్ద పార్టీగా గెలిపించుకున్నాడు. కానీ మెజారిటీకి 10 అడుగుల దూరంలో ఆగిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లతో మద్దతు తెలపగా, మెజారిటీకి మరో ఐదు సీట్లు కొరత ఉన్నాయి. సీపీఐ, సీపీఎం తలా రెండు సీట్లు గెలుచుకోగా వారు టీవీకే పార్టీకే మద్దతిస్తామని తెలిపారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని గవర్నర్‌ని కలిస్తే, మిగిలిన ఆ ఒక్క సీటు కొరత పూరించే హామీ మొదట చూపించమంటూ ఆయన వెనక్కి పంపారు.. సాధారణంగా అయితే ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రానప్పుడు, గెలిచిన వాళ్లలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీని గానీ, కూటమిని గానీ ముందుకు రమ్మంటారు.. లేదా ముందుకు వస్తే సరే అని అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోమని కొంత వ్యవధి ఇస్తారు. అలా ఖచ్చితంగా పిలవాలని నిబంధన లేనప్పటికీ అది ఆచారం. ఉన్నంతలో సబబైన పని. ఇలాంటి చోట్ల గవర్నర్ విచక్షణకే నిర్ణయాన్ని రాజ్యాంగం, న్యాయపాలిక వదిలేశాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ అనిశ్చితి పెరుగుతుంది. రాజకీయ అవకాశవాదం పెరుగుతుంది. కాబట్టి వెంటనే రాజ్యాంగ పరంగా సరైనది అనుకున్న నిర్ణయాన్ని తీసుకోవాలి తప్పితే జాప్యం చేయకూడదు. మరోవైపు తక్కువ సీట్లు పొందిన రెండు ప్రత్యర్ధ పార్టీలూ కలిసిపోయి టీవీకే ఆశలపై నీళ్లు జల్లుతాయని గుసగుసలు మొదలయ్యాయి. సినిమా తెరను మించి మసాలా పంచుతున్న తమిళ రాజకీయాల క్లైమాక్స్ ఘట్టం ప్రజలకు మాత్రం రుచించనిది. ప్రజాస్వామ్యానికి కూడా.
-డా. డి.వి.జి శంకరరావు
94408 36931






