- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బలవన్మరణాలను నియంత్రించండి!
దేశంలో రోజూ చిన్న పెద్ద, అనే తారతమ్యం లేకుండా, చదువుకున్న వాళ్లు, నిరక్షరాస్యులు, విద్యార్థులు ఒక్క క్షణాన్ని విస్మరించి

దేశంలో రోజూ చిన్న పెద్ద, అనే తారతమ్యం లేకుండా, చదువుకున్న వాళ్లు, నిరక్షరాస్యులు, విద్యార్థులు ఒక్క క్షణాన్ని విస్మరించి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ మధ్య ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఆత్మహత్యలకు పాల్పడటం చూసి సమాజం విస్తుపోతోంది. ఆర్థిక భారం అని కొందరు, చదువులలో విజయం సాధించలేదని కొందరు, ప్రేమలో విఫలం అయ్యామని, కుటుంబ కలహాలు ఇలా అనేక కారణాలతో ఎవరికి వాళ్లు ఆ సమస్యల పట్ల నియంత్రణ కోల్పోయి వాళ్ల ప్రాణాలు తీసుకుంటున్నారు. జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతోనే ఉన్నారు. నిజానికి జీవితమంటే అన్నీ ఎదుర్కొని సాగడమే.. మనిషికి అన్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడే సంఘర్షణ మొదలవుతుంది. అప్పుడు నమ్మిన వాళ్లతో ఆ సమస్యలను పంచుకోవాలి. అప్పుడే మనస్సులో బాధ తగ్గుతుంది. ఏ సమస్యనైనా ప్రాణం ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. ప్రాణం తీసుకుంటే మీ జీవితానికి మీరే మచ్చ తెచ్చుకున్న వాళ్లు అవుతారు.. భారతీయ కుటుంబ వ్యవస్థలో ఆధునిక పోకడల వలన ఎవరికి వారే యమునా తీరే అనేలా నాలుగు గోడల మధ్య ఉండే మనస్పర్థలు, సమస్యలను బజారుకు ఈడుస్తున్నారు.. అవమానాలను తట్టుకోలేని వాళ్లు బలవన్మరణాల వైపు మొగ్గు చూపుతున్నారు.. ఆత్మహత్యకు మందు ఒక్క క్షణం మనల్ని నమ్ముకున్న వాళ్లను తలుచుకుంటే వారి ఘోష అర్థం అవుతుంది. అనాలోచితంగా మీరు తీసుకునే ఆ ఒక్క క్షణం నిర్ణయం మీ జీవితాలనే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వారి జీవితాలనూ బుగ్గిపాలు చేస్తున్నాయి. చనిపోయి ఏమీ సాధించలేరు, బతికి సాధించి చూపండి.. అప్పుడే మీ బతుకుకి ఒక అర్థం ఉంటుంది. ప్రస్తుతం ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం కమిటీ వేసి ఆ కమిటీలో అన్ని విభాగాలను చేర్చి ఆత్మహతలు చేసుకోవాలనే ఆలోచన వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఏర్పరచి వారు బతకడానికి నమ్మకం కలిగించేలా చేయాలి.
-డాక్టర్. వై. సంజీవ కుమార్,
94936 13555
- Tags
- suicides






