వర్షాలతో అప్రమత్తంగా ఉండండి!

by Ravi |   (  Updated:2025-07-20 00:30:55  IST  )

వచ్చే రెండు మాసాలు వర్షాలు, వరదలు వచ్చే కాలం. అందుకే ఎవ్వరికి వాళ్లు తీసుకునే తగు జాగ్రత్తలే ప్రాణ నష్టాన్ని

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి!
X

వచ్చే రెండు మాసాలు వర్షాలు, వరదలు వచ్చే కాలం. అందుకే ఎవ్వరికి వాళ్లు తీసుకునే తగు జాగ్రత్తలే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది. ఏమరు పాటుతో ఉంటే జీవితాలను అతలాకుతలం చేస్తాయి. మీరు తీసుకునే నివారణ చర్యలే మిమ్మల్ని, మీరు కాపాడుకునే అవకాశం అందిస్తాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దు. కుదిరితే కొన్ని రోజుల వరకు సరిపడేలా తగినన్ని ఆహార పదార్థాలను, నిత్యావసర సరుకులు, నీటిని నిల్వ చేసుకొని, అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోండి. ఈ వర్షాలు, వరదలు ఉన్నన్ని రోజులు వేడిచేసిన నీటిని మాత్రమే తాగండి. వర్షం నీరు నిలువ ఉంటే దోమలు, ఇతర క్రిమి కీటకాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. మీ పరిసరాలను ఎప్పటి కప్పుడు శుభ్రంగా ఉంచుతూ, క్రిమి సంహారకాలను ఉపయోగించండి. వర్షాలు ఎక్కువ పడి వరదనీరు ఇంట్లో నీరు చేరితే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయండి. వర్షాలు తగ్గిన తర్వాత మలేరియా వంటి వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి తప్పని సరిగా దోమ తెరలను ఉపయోగించండి. వరదనీరు ఉధృతంగా ప్రవహించే ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం కొనసాగించకండి. రోడ్ల పైన నడిచేవాళ్లు పక్కన ఉండే కరెంటు స్తంభాలను తాకకుండా నడవండి. స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు కచ్చితంగా గొడుగు, రెయిన్ కోట్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు సాధ్యమైనంత మేరకు క్యాబ్స్, మెట్రో, బస్సు సౌకర్యాలను వినియోగించుకోవాలి. ఇక ప్రభుత్వం లోతట్టు ప్రాంతాలకు గుర్తించి, అక్కడి ప్రాంత ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించాలి. అలాగే ఆహారం, నీరు, నిత్యావసర వస్తువులు అందించేలా ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలి. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రజల ఆరోగ్యానికి కావలసిన ఔషధాలు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ సూచనలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకొని అప్రమత్తంగా ఉన్నప్పుడే మరింత భద్రంగా ఉంటారు.

వై. సంజీవ కుమార్,

94936 13555

Next Story