- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుర్ముహూర్తాలు ఉంటాయా?
కాలం అనంతం. కాలాన్ని ఖండన చేయలేం. అది ఎవరికోసమో ఆగదు. సాగిపోతూనే ఉంటుంది. కాలాన్ని మన అవసరం కోసం సులభతరంగా

కాలం అనంతం. కాలాన్ని ఖండన చేయలేం. అది ఎవరికోసమో ఆగదు. సాగిపోతూనే ఉంటుంది. కాలాన్ని మన అవసరం కోసం సులభతరంగా గుర్తుపట్టడం కోసం మనం కాలాన్ని విభజించుకుని గంటలు, నిమిషాలు, సెకండ్‌లు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలుగా విభజించి, ఉపయోగించుకొని మన జీవితం గడుపుకుంటాం. కానీ మంచికాలం, చెడుకాలం అనేది ఉండదు. మంచి సమయం, చెడు సమయం, మంచి రోజులు, చెడు రోజులు, చెడు నెలలు అనేవి ఉండవు. ఏ కాలమైనా మంచిదే.. మనిషి ఎప్పుడూ మంచి జరగాలనే కోరుకుంటాడు చెడు వస్తే భరించలేడు. కొన్ని కష్టాలు మనుషులు స్వయంగా తెచ్చుకునేవి, కొన్ని ఇతరుల వల్ల జరిగేవి, కొన్ని అనుకోకుండా జరుగుతాయి. అయితే మనిషి కష్టానికి కారణాలు చాలావరకు స్వయంకృతాపరాధాలే. కానీ మంచి రోజు మంచి సమయం వల్ల కాదు. మంచి ముహుర్తాలకే అంత విలువ ఉంటే మంచి ముహుర్తంలో ప్రారంభించిన కట్టడాలు కూలిపోవు, పెళ్లి చేసుకున్న జంటలు విడాకులు తీసుకోవు. అంటే ఇక్కడ ముహూర్త బలం లేదన్నమాట. వధూవరుల ఆలోచనా స్వభావం, వారి నడవడిక, వారి పనుల వల్లనే మంచి చెడు జరుగుతుంటాయి. అలాగే కట్టడాల విషయంలోనూ నాణ్యత ఉంటే ఎక్కువ కాలం మన్నుతాయి.
అందుకోసం మనకు వీలున్నట్టు వీలైన సమయాన ఏ కార్యమైనా చేసుకోవాలి. కానీ ముహూర్తాలు చూపించి చేసుకోవడం అనవసరం. మనుషుల్లో స్వయం ఆలోచన లేనందు వలన ముహూర్తాలను నమ్మడం జరుగుతున్నది. కానీ కాస్త ఆలోచించి చూస్తే ముహూర్తాలకు బలం లేదని తెలిసిపోతుంది. కాలాన్ని సుముహూర్తం, దుర్ముహూర్తం అని చెప్పడం కూడా అబద్ధం. కాబట్టి విజ్ఞులైన వారి ఆలోచనల్లో మార్పు రావాలి. స్వయంగా ఆలోచించి వ్యర్థమైన వాటిని వదులుకొని ప్రవర్తిస్తే అందరికీ మేలు జరుగుతుంది. కారణాలు తెలుసుకొని జీవనం గడుపు కోవడమే సరి అయిన విధానం.
అడియాల శంకర్
70930 62745






