- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్సిటీల్లో ఆచార్యులేరీ?
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బోధన సంక్షోభంలో చిక్కుకున్నయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్

రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బోధన సంక్షోభంలో చిక్కుకున్నయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. నిధుల లేమితో నిర్వీర్యం అవుతున్నాయి. ప్రతినెలా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్నారు కానీ నియామకాల ప్రక్రియ మాత్రం చేపట్టడం లేదు. దీంతో విశ్వవిద్యాలయాలు ఖాళీగా మారే పరిస్థితి దాపురించింది.
ఒకప్పుడు దేశంలో ఒక వెలుగు వెలిగిన మన విశ్వవిద్యాలయాలు నేడు ప్రభను కో ల్పోతున్నాయి. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల పరిధిలో 2,857 పోస్టులను ప్రభు త్వం మంజూరు చేసింది. అందులో 757 (26.50 శాతం) మంది ఆచార్యులు మాత్ర మే పనిచేస్తున్నారు. 2,060 (73.50శా తం) పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం.
2013తో వర్సిటీ పోస్టుల భర్తీకి బ్రేక్
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1,267 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫె సర్ పోస్టులుంటే, వాటిలో 376 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏకంగా 891 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెం ట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక కేయూ లో 409 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుంటే, 86 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. దాదాపు 323 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రతిష్టాత్మకమైన ఆ రెండు విశ్వవిద్యాలయాలకే పరిమి తం కాలేదు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నది. ప్రతి నెలా ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నప్పటికీ.. 12 ఏండ్లుగా నియామకాల ప్రక్రియ మాత్రం చేపట్టడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2013లో నియామకాల ప్రక్రియ సాగింది. తెలంగాణ వచ్చినా వర్సిటీల్లో పోస్టుల భర్తీ ఊసే లేదని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. ఇంకోవైపు పలు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫె సర్లు లేని కారణంగా ఇతర వర్సిటీలకు చెం దిన ప్రొఫెసర్లను రిజిస్ట్రార్‌గా నియమిస్తున్నారు. ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండడం తో పలు విభాగాలు మూతపడే ప్రమాదమున్నది. పరిశోధనలు కుంటుపడుతున్నాయి. న్యాక్, ఎన్టీఏ గ్రేడ్లైపై ప్రభావం పడుతున్నది. దీంతో ప్రొఫెసర్ల వయో పరిమితిని ఇటీవలే ప్రభుత్వం 65 ఏండ్లకు పెంచింది.
నియామకాలకు విధానమే లేదు
విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి విధా నమే లేకపోవడం గమనార్హం. గతంలో విశ్వవిద్యాలయం యూనిట్‌గా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వర్సిటీలే నోటిఫికేషన్లను విడుదల చేసి నియామకాల ప్రక్రియను చేపట్టే విధానం ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. గత పాలకు లు చేసిన దాన్నే అనుసరించి ముందు కెళ్తారా? లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? అనేది వేచి చూడవలసిన అంశం.
నివేదిక ఇవ్వని కమిటీ
రాష్ట్రంలోని కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు, పీఎన్టీయూ, ఆర్జీయూకేటీ యూనివర్సిటీల్లో అసలు ప్రొఫెసర్లే లేరు. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల తోనే బోధనను నెట్టుకొస్తున్నారు. అధికారంలోకి రాగానే యూనివర్సిటీలకు నిధులు పెంచుతామని, ఉన్నత విద్యను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఏడాది గడిచినా ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు. యూనివర్సిటీల్లో నియామకాల కో సం ఉన్నత విద్యా మండలి, వీసీల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు నిరుడు డిసెం బర్ 13న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో ప్రొఫెస ర్లు ఎం. కుమార్, అల్తాప్ హుస్సేన్ సభ్యులు గా ఒక కమిటీని నియమించింది. నెల రోజు లు దాటినా ఆ కమిటీ నివేదిక అందించలే దు. దీంతో ఇప్పటి వరకు పోస్టుల భర్తీపై ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఎన్నిక ల్లో హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పాలకులు వెంటనే స్పందించి ఉన్నత విద్యారంగం అభ్యున్నతిపై దృష్టిపెట్టాలని లేకపోతే సామా జిక, శాస్త్రీయ రంగాల్లో వెనుకబడిపోవాల్సి వస్తుందని విద్యా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సభావట్ కళ్యాణ్
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు
90143 22572






