- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సవాళ్ళ మధ్య ఏపీ వృద్ధిరేటు సవారీ!
గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వ అద్వాన్న ఆర్ధిక విధానాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక అరాచకం రాజ్యమేలింది.

గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వ అద్వాన్న ఆర్ధిక విధానాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక అరాచకం రాజ్యమేలింది. జగన్ ఆర్ధిక ఉగ్రవాదం పుణ్యమా అని రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయింది. రుణ చెల్లింపులు భారం రూ లక్ష కోట్లు దాటిపోయింది.204-205 రాజ్యాంగ అధికరణలను ఉల్లంఘించి, శాసనసభను దారితప్పించి నిధులు వ్యయంలో విశృంఖలంగా వ్యవహరించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని కాగ్ కూడా కడిగి పారేసింది. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన సియం చంద్రబాబు పన్నులు బాదుడు జోలికి పోకుండా కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తూ,మూల ధన వ్యయాన్ని పెంచుతూ రాష్ట్రాన్ని ప్రగతి పట్టించే బృహత్తర భాధ్యతను తన భుజస్కoదాల పై వేసుకొన్నారు.
దుబారా ఖర్చులకు దూరంగా వుంటూ, గాడి తప్పిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను చక్క దిద్దుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకొంటూ ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి బాట పట్టించడానికి ఏడాదిన్నరగా అలుపెరుగకుండా శ్రమిస్తూ సమర్ధ ప్రణాళికలు, విన్నూత్న విధానాలతో ముందుకు సాగుతున్నారు. గత ప్రభుత్వ ఆర్ధిక అరాచకాన్ని సరిదిద్ది 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీ వీ ఏ రూ 17,12,800 కోట్లు- జీఎస్టీపీ రూ 18,65,704 కోట్లు-మొత్తంగా 17.11 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకొని సియం చంద్రబాబు కాలంతో పోటీ పడుతున్నారు.
గాడిలో పడిన రాష్ట్ర అభివృద్ది
ఆధునికతను అందిపుచ్చుకొని అద్భుత వ్యూహంతో రెండంకెల వృద్దిరేటు సాధించి నవ్యాంధ్రను ప్రగతిపథం బాటపట్టించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రం రెండు అంకెల వృద్ధి రేటుతో సవారీ చేస్తుంది అనడానికి ప్రస్తుత ఆర్థిక వృద్ధి గణాంకాలే ఉదాహరణ. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు వంటి పలు రంగాల్లో మెరుగైన ఫలితాలతో రాష్ట్ర అభివృద్ధి గాడిలో పడింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, గ్రాస్ వాల్యూ అడిషన్, వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలు నమోదు చేసిన వృద్ధి గణాంకాలను ఒక సారి పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రస్తుత ధరల్లో రాష్ట్ర జీఎస్టీపీ మొత్తంగా 11.28 శాతం వృద్ధి నమోదు అయినట్లు సమాచారం. రూ.4,00,377 కోట్ల విలువైన జీఎస్టీపీ నమోదు కాగా, అదే సమయానికి భారతదేశ జీడీపీ 8.7 శాతం మాత్రమే.సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధన కోసం సియం చంద్రబాబు సమర్ధ నాయకత్వంలో ఏపీలో అమలుచేస్తున్న పాలసీలు ,విధానాలు రాష్ట్రాభివృద్ధికి దోహద పడుతున్నాయి.
అన్ని రంగాల్లో ముందంజ
వ్యవసాయ రంగంలో 11.43 శాతం, హర్టీకల్చర్ 4.35 శాతం, ఫిషింగ్, ఆక్వాకల్చర్ రంగాల్లో 26.27 శాతం, లైవ్ స్టాక్ 4.18 శాతం వృద్ధి రేటు సాధించింది రాష్ట్రం. వరి 3.64 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగి 24 శాతం వృద్ధి సాధించింది. 21.55 లక్షల వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. జల రవాణా ద్వారా 52.50 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. ఈ త్రైమాసికంలోనే 14.98 లక్షల మంది విమానాల్లో ప్రయాణించినట్లు రియల్ ఎస్టేట్ రంగంలో రూ.32,951 కోట్లతో 14.31 శాతం పెరుగుదల నమోదు అయినట్లు సమాచారం.ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరం జీఎస్డీపీ రూ.7,58,270 కోట్లు. వ్యవసాయరంగంలో 10.26 శాతం వృద్ధి నమోదైంది. పరిశ్రమల రంగంలో 12.05 శాతం, సేవల రంగంలో 11 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం లక్ష్యంలో తొలి రెండు త్రైమాసికాలు కలిపి 41 శాతం జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకోగా రానున్న రెండు త్రైమాసికాలు కలిపి జీఎస్డీపీ రూ.11,07,434 కోట్ల సాధనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది.
రెండంకెల వృద్ధి బాటలో ఏపీ
గత జగన్ ప్రభుత్వం ఆర్ధిక అరాచకంతో వృద్ధి రేటు ఆరు శాతానికి పడిపోయింది. ఐదేళ్లలో రూ.ఏడు లక్షల కోట్ల విలువైన రాష్ట్ర స్థూల ఉత్పత్తిని (జీఎస్డీపీ) కోల్పోయి సుమారు రూ.76,195 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. నేడు ఆంధ్రప్రదేశ్ రెండు అంకెల వృద్ధి రేటు సాధించడం మంచి పాలనకు, సమర్ధ ఆర్ధిక విధానాలకు లభించిన ఫలితం. పరిశ్రమలు, వ్యవసాయం, సేవల రంగం, మూడు విభాగాలు వేగంగా ముందుకు సాగినప్పుడు మాత్రమే రాష్ట్రం ఇంతటి వృద్ధి సాధ్యం అవుతుంది. గత ప్రభుత్వ అస్థిర ఆర్ధిక విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అయింది. కూటమి ప్రభుత్వం తీసుకొన్న సంస్కరణలు, పాలసీలు ఆంధ్రప్రదేశ్ రెండంకెల వృద్ధి రేటుతో దేశ ఆర్థిక పటంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రంగా నిలిచింది. సమర్థ పాలన, పెట్టుబడుల సాధన, వ్యవసాయ బలోపేతం కలిసి రాష్ట్రాన్ని డబుల్ డిజిట్ గ్రోత్‌కు చేర్చాయి.
అసలు సిసలు ఆర్థిక విప్లవం
ప్రభుత్వ దూరదృష్టి తో సాధించిన ఆర్థిక విప్లవం అని చెప్పాలి. రెండు అంకెల వృద్ధి రేటు సాధించడం కొద్దీ రాష్ట్రాలకే సాధ్యం అవుతుంది. రెండు అంకెల వృద్ధి రేటు కేవలం గణాంకం కాదు, రాష్ట్ర ఆర్థిక శక్తికి, సమర్థ పాలనకు, పెట్టుబడుల సాధన, ప్రజల జీవన ప్రమాణాల పెంపుకు నమ్మకమైన సంకేతం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రాధాన్యత ఇచ్చి ధ్వంసం అయిన వ్యవస్థలను గాడిలో పెట్టి ఏడాదిన్నరలో ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించారు సియం చంద్రబాబు. రెండో త్రైమాసికం ప్రస్తుత ధరల్లో రాష్ట్ర జీఎస్టీపీ మొత్తంగా 11.28 శాతం వృద్ది సాధించడం గర్వించదగ్గ విషయం. సమర్ధ నాయకత్వం కింద. ముక్కోణపు వ్యూహంతో ఏపీ ముందుకు అడుగు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అద్భుతాంధ్రప్రదేశ్‌గా, స్వర్ణాంధ్రగా తనని తాను ఆవిష్కరించుకునే తరుణం రాబోతుంది.
నీరుకొండ ప్రసాద్
98496 25610






