Andesri: మర్చిపోలేని వ్యక్తి అందెశ్రీ

by Ravi |   (  Updated:2025-11-11 00:30:40  IST  )

అందెశ్రీ పాటనే కాదు.. ఆయన గొంతులో ఒక మహత్తరమైన గాంభీర్యం ఉంటుంది. మైక్ లేక పోయినా సరే ఆ గొంతులోని బేస్ మనల్ని కట్టిపడేస్తుంది. ఆయనో అద్భుతమైన కవి, గాయకులు..

Andesri: మర్చిపోలేని వ్యక్తి అందెశ్రీ
X

అందెశ్రీ పాటనే కాదు.. ఆయన గొంతులో ఒక మహత్తరమైన గాంభీర్యం ఉంటుంది. మైక్ లేక పోయినా సరే ఆ గొంతులోని బేస్ మనల్ని కట్టిపడేస్తుంది. ఆయనో అద్భుతమైన కవి, గాయకులు.. తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా ఆయనకు లభించిన ఘనకీర్తి ఎల్లలు దాటింది. ఆయన తెలంగాణ పాటతోనే మనతోనే ఎప్పటికీ ఉంటారు. అయినా చావు భౌతికమైనదే! ఆయన మరణం యావత్ తెలంగాణకే కాదు. ఈ దునియాకు తీరని లోటు.. ఆయన చనిపోయారని వార్త చూడగానే నమ్మాలనిపించలేదు. ఆయనను నేను కలిసింది కూడా చాలా తక్కువ సార్లే. నా జీవితంలో మర్చి పోలేని ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఆయనతోనే ఉంది. పోయిన బుక్ ఫెయిర్ సమయంలో నేను నా స్నేహితులతో కలిసి అక్కడ తిరుగుతున్న సమయంలో అందెశ్రీ ఎదురయ్యారు. ఆయన్ని చూడగానే అన్న జై భీమ్ అన్నాను. అప్పుడు ఆయన నా వైపు చూస్తూ వేరే స్టాల్స్ వైపు పోయిండు. ఏమైంది పెద్దాయన ఏమి మాట్లాడకుండా పోయిండని అంటుండగానే అటిటూ తిరిగి మళ్లీ మా దగ్గరకు వచ్చిండు. వచ్చీ రాగానే ఇందాకల నువ్వేనా జై భీమ్ అన్నది అన్నాడు. అవునన్న అంటూ మళ్లీ జై భీమ్ అన్నా అంటూ షేక్ హ్యండ్ ఇస్తూ ఆయన జై రామోజీ అన్నడు. ఇదేందన్న అని నేను అనగానే నాకెందుకయ్యా జై భీమ్ గీభీమ్ అంటూ నన్ను అందులోకి లాగుతారన్నడు. ఆ రోజు నేనొక సెషన్స్‌లో మాట్లాడినంతసేపే కాదు.. ఇప్పటికీ నాకది గుర్తుంది. ఎప్పటికీ ఉంటుంది. ఆయన జై రామోజీ అనంగనే అంటే ఏందన్న అని అడిగిన.. వెంటనే ఆ.. ఏముందిరా మొన్న రామోజీరావు చని పోయాడు గదా అది ఉంటుందేమో అని నా స్నేహితుడు అనంగనే అందరం నవ్వుకున్నాం. ఆయన తెలంగాణ పాటతోనే మనతోనే ఎప్పటికీ ఉంటారు. జోహార్లు అందెశ్రీ.

- వరకుమార్ గుండెపంగు

99485 41711

Next Story