లెఫ్టినెంట్ రామ్ ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’

by  |
dulkar-salman
X

దిశ, సినిమా : సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న నటుడు దుల్కర్ సల్మాన్‌‌. తమిళ్, మలయాళ సినిమాలు ఎక్కువగా చేసే దుల్కర్‌ను భాషతో సంబంధం లేకుండా దక్షిణాది ప్రేక్షకులందరూ ఇష్టపడతారు. ‘మహానటి’లో జెమిని గణేషన్ పాత్ర ద్వారా తెలుగువారికి పరిచయమైన యంగ్ హీరో.. ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. కాగా బుధవారం దుల్కర్ బర్త్‌డే సందర్భంగా న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమాలో దుల్కర్ ‘లెఫ్టినెంట్ రామ్’ పాత్రలో నటిస్తుండగా.. సైకిల్‌పై కూర్చుని హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్న ఫొటోను షేర్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మంచు కురుస్తుండగా, ఎల్లో టీ-షర్ట్‌లో దుల్కర్ హ్యాండ్సమ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన వీడియోలో లెఫ్టినెంట్ క్యారెక్టర్‌ గ్లింప్స్ కూడా రివీల్ చేశారు. కాగా స్వప్న మూవీస్, వైజయంతి మూవీస్ ప్రొడక్షన్‌లో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Next Story