- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగేండ్లైతున్నా పట్టించుకునే నాథుడే లేడు : ఇందల్వాయి ప్రజలు
<p>దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని గండి, ఇందల్వాయి, త్రియంబక్ పేట్ తండాలకు వెళ్లే పంచాయత్ రాజ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఈ దారిగుండా ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తండాలు గ్రామాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనైనా ఈ రోడ్లకు మరమ్మతులు చేపడుతారని ప్రజలు ఆశించారు. ఈ తండాలు గ్రామపంచాయతీలుగా ఏర్పాటై నాలుగు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకూ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. […]</p>

X
దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని గండి, ఇందల్వాయి, త్రియంబక్ పేట్ తండాలకు వెళ్లే పంచాయత్ రాజ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఈ దారిగుండా ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తండాలు గ్రామాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనైనా ఈ రోడ్లకు మరమ్మతులు చేపడుతారని ప్రజలు ఆశించారు. ఈ తండాలు గ్రామపంచాయతీలుగా ఏర్పాటై నాలుగు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకూ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందల్వాయి, గండి, త్రియంబక్ పేట్ వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. దీనికి తోడు వర్షాలు ఎక్కువగా పడడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సర్పంచులు చందర్ నాయక్, కుమార్ నాయక్ లు కోరుతున్నారు.
Next Story






