అడిగేవారు లేరని.. హనుమాన్ టెంపుల్‌లో మందు, మాంసం..!

by  |
అడిగేవారు లేరని.. హనుమాన్ టెంపుల్‌లో మందు, మాంసం..!
X

దిశ, వెబ్‌డెస్క్: హనుమాన్ టెంపుల్‌లో మందు, మాంసం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్సీపురం కాచిరెడ్డిపల్లి హనుమాన్ ‌టెంపుల్‌‌లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి అయితే చాలు గుడి ఆవరణలో అడ్డా పెడుతున్నారు. ఇదే గుడిలో పోచమ్మ, నాగులమ్మ అమ్మవార్ల ఆలయాలు కూడా ఉన్నాయి. సాధారణంగా బోనాల జాతర సందర్భంగా ఇక్కడ జంతు బలి ఉంటుంది. అయినప్పటికీ ఈ గుడిలో మద్యపానం నిషేధం.

ఇటువంటి పవిత్ర హనుమాన్ ఆలయంలో కొంతమంది ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం గమనార్హం. గుడిమెట్ల మీదనే మాంసం ముక్కలు పెట్టుకొని మద్యం సేవించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం గుడికెళ్లి చూస్తే.. అంతటా మందు బాటిళ్లు దర్శనమిస్తున్నాయని, మాంసం ఎముకలు ఉంటున్నాయని వాపోతున్నారు. ఆలయంలో ఇటువంటి పాడు పనులు ఏంటని.. స్థానిక కార్పొరేటర్ సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story