రమేష్ హాస్పిటల్ కేసు : రాయపాటి కూతురికి డౌట్స్!! 

by  |
రమేష్ హాస్పిటల్ కేసు : రాయపాటి కూతురికి డౌట్స్!! 
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో జరిగిన కోవిడ్ హాస్పిటల్ అగ్నిప్రమాదం కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఘటనకు సంబంధించి ఇటీవలె మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలిని విజయవాడ ఏసీపీ ఒక రోజంతా విచారించారు. ఇప్పుడు రాయపాటి తమ్ముడు కుమార్తె, డాక్టర్ శైలజను కూడా విజయవాడ పోలీసులు విచారించారు. ఆమె పని చేస్తున్న గుంటూరు రమేష్ హాస్పటల్ కే వెళ్లి విచారించినట్టు తెలుస్తోంది.

ఈ విచారణ అనంతరం డాక్టర్ శైలజ మాట్లాడుతూ… కోవిడ్ సెంటర్లు ఎక్కడైనా విజిట్ చేసారా అని పోలీసులు అడిగారని, తాను 7,8 నెలలుగా వైద్య వృత్తి లో లేనని చెప్పానని స్పష్టం చేశారు. తన పుట్టుపూర్వోత్తరాలు కూడా అడిగారన్న ఆమె, మొన్న జరిగిన అగ్నిప్రమాదం అనుకోకుండా జరిగిన దుర్ఘటనగా పేర్కొన్నారు. పెద్ద ఎత్తున వత్తిళ్ళు వస్తేనే కోవిడ్ సెంటర్ల నిర్వహణకు డాక్టర్ రమేష్ ముందుకు వచ్చారని వెల్లడించారు.

చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడా ఇంతలా వేధింపులు లేవని ఆరోపించారు. 30 ఏళ్ళుగా తెచ్చుకున్న పేరును ఇప్పుడు కులం పేరుతో దుష్ప్రచారం చేయటం బాధాకరం అన్నారు. ప్రభుత్వం అనుమతిస్తేనే ప్రైవేటు కోవిడ్ సెంటర్ ని ఏర్పాటు చేశారని చెప్పారు. రమేష్ బాబుని రమేష్ చౌదరి గా ప్రచారం చేస్తుంటే అది టార్గెట్ చేసినట్టుగానే కనపడుతుందని డాక్టర్ శైలజ అనుమానం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed