నెమలికి అంత్యక్రియలు ఎలా చేస్తారో తెలుసా( వీడియో)..?

by  |
PEACOCK NEWS
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: భారతీయ రాజ్యాంగ వ్యవస్థ లో నెమలి కి ప్రత్యేక స్థానం ఉంది.. ఎందుకంటే నెమలి భారతదేశ జాతీయ పక్షి. అయితే నెమలి జాతీయ పక్షి అని మాత్రమే అందరికి తెలుసు.. కానీ, అవి చనిపోతే ప్రోటోకాల్ ప్రకారం వాటికి అంత్యక్రియలు భారత ప్రభుత్వమే దగ్గరుండి చేస్తోందని ఎంతమందికి తెలుసు.. మరి ఆ ప్రోటోకాల్ ఏంటో తెలుసుకుందాం.

జాతీయ పక్షి నెమలి చనిపోతే.. మొదట దానికి అధికారులు పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. దాని రిపోర్ట్ ను సంబంధిత ఫారెస్ట్ ఆఫీసర్స్ కు అందించి పంచనామా చేస్తారు. మృతిచెందిన నెమలికి జాతీయ జెండాను చుట్టి నివాళులు అర్పించి, దహనం కానీ, ఖననం కానీ చేస్తారు. ఇక ఇదంతా ఓ రిపోర్ట్ రూపంలో ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర భద్రపరుస్తారు. అంత్య క్రియలకు ఉపయోగించిన జెండాను మరోచోట గోయి తవ్వి పూడ్చివేయడమో.. లేదా కాల్చివేయడమో చేస్తారు. ఇక అన్ని నెమళ్లకు ఇలా చేయరు. మగ నెమలి మాత్రమే జాతీయ పక్షి కాబట్టి.. దానికి తగ్గ గౌరవాన్ని అందిస్తారు. ఆడనెమలికి ఈ గౌరవం దక్కదు. ఇది జాతీయ పక్షి నెమలి చనిపోతే అధికారులు చేసే అంత్యక్రియలు.


Next Story