- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్జీవీ సినిమాపై కోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనపై సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే విడుదల చేసి, అందరినీ ఆకర్షించాడు. తాజాగా ఈ మూవీని ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు శుక్రవారం విచారించారు. ఈ మూవీ నిర్మాణం చేపట్టడం సరికాదని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనపై సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే విడుదల చేసి, అందరినీ ఆకర్షించాడు. తాజాగా ఈ మూవీని ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు శుక్రవారం విచారించారు. ఈ మూవీ నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తరపు న్యాయవాది, కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. దిశ తండ్రి ఇచ్చే వినతిపత్రంపై కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.
Next Story






