‘దిశ’ ఎఫెక్ట్ : స్పందించిన దాతలు…: Disha

by  |
‘దిశ’ ఎఫెక్ట్ : స్పందించిన దాతలు…: Disha
X

దిశ, పెద్దపల్లి : కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తున్న వేళ ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి బంధువులు ఆసుపత్రుల బయట తమవారికి కోసం పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించి ఈనెల 19న రాత్రి 11 గంటల సమయంలో దిశ పత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన కథనానికి ఎంపీపీ బాలాజీ రావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు స్పందించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ వద్ద బాధితుల బంధువుల పడుతున్న ఇబ్బందులపై దిశ పత్రికలో ‘కొవిడ్ సెంటర్ల వద్ద కోటి కష్టాలు’ అనే శీర్షిక ప్రచురితమైంది.

ఐసోలేషన్ సెంటర్ ముందు ఖాళీ స్థలంలో కునుకు తీస్తున్న వారు కొందరైతే, చిన్నారులతో సహ వచ్చి తమవారి ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆందోళనతో ఎదురు చూస్తున్న వారు మరికొందరు. వేసవి తాపంతో పొద్దంతా అక్కడే ఎదురు చూసిచూసి చీకటి కాగానే అక్కడే నిద్రిస్తున్నారు అంటూ ప్రచురితమైంది. దీంతో ఐసోలేషన్ సెంటర్ ఆవరణలో ఎంపీపీ బాలాజీ రావు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి రామ్మూర్తి, కార్యదర్శి అల్లంకి లింగమూర్తి, కోశాధికారి సిరిపురం రమేష్ చలువ పందిళ్లు వేయించి, మంచినీటి వసతులు, విద్యుత్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీకి, ఆర్యవైశ్య సంఘం నాయకులకు కొవిడ్ బాధితుల బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed