హాట్ టాపిక్‌గా ఆరోగ్యశాఖలో HODల మార్పు.. కొత్త బాసుల‌పై ఆరా..

by Shyam |   (  Updated:2021-10-09 03:09:44  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన హెచ్‌ఓ‌డీ పోస్టుల్లో మార్పులు జరిగే అవకా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా డీఎమ్‌ఈ, డీహెచ్, నిమ్స్ డైరెక్టర్ పోస్టుల్లో కొత్త హెచ్ఓడీలు రానున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినా, మార్పులు తప్పనిసరి అని ఆరోగ్య శాఖ‌కు సంకేతాలు అందాయి. దీనితో కొత్త బాసులు ఎవరా? అని ఉద్యోగులు ఆరా తీస్తున్నారు.  మరో వైపు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు [&hellip;]</p>

హాట్ టాపిక్‌గా ఆరోగ్యశాఖలో HODల మార్పు.. కొత్త బాసుల‌పై ఆరా..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన హెచ్‌ఓ‌డీ పోస్టుల్లో మార్పులు జరిగే అవకా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా డీఎమ్‌ఈ, డీహెచ్, నిమ్స్ డైరెక్టర్ పోస్టుల్లో కొత్త హెచ్ఓడీలు రానున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినా, మార్పులు తప్పనిసరి అని ఆరోగ్య శాఖ‌కు సంకేతాలు అందాయి. దీనితో కొత్త బాసులు ఎవరా? అని ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. మరో వైపు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం కావడంతో కొత్త బాస్‌ల పేర్లు తెలుసుకునేందుకు ఆ శాఖ‌లో ఉద్యోగులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే డీఎంఈ పోస్ట్ కొరకు డా త్రివేణీ, డా శంకర్‌ల పేర్లు ఎక్కువగా వినిపిస్తుండగా, నిమ్స్ డైరెక్టర్‌గా కరుణాకర్ రెడ్డి, డీ హెచ్‌గా.. డా రవీందర్ నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. అంతేగాక ప్రస్తుతం ఉన్న హెచ్ ఓ డీ‌లు ఏ ఏ పోస్టులకి వెళ్తున్నారో ?అని కూడా చాలా మంది అన్వేశిస్తున్నారు. మరో వైపు డీ హెచ్ పోస్టుకు ఇప్పుడు ఉన్న అధికారి సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రభుత్వ విచారణ‌లో తేలింది. ఈక్రమంలో ఆయన పోస్టు‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story