ఇస్మార్ట్ శంకర్‌కు ‘రెడ్’ గిఫ్ట్

by  |
ఇస్మార్ట్ శంకర్‌కు ‘రెడ్’ గిఫ్ట్
X

ఈ రోజు (మే 15)న ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ‘రెడ్’ మూవీ టీమ్ రామ్‌కు ఇస్మార్ట్ గిఫ్ట్‌ ఇచ్చింది. ఈ సినిమాలోని మాస్ బీట్ డించాక్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి.. మాసివ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది. హెబ్బా పటేల్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ సాంగ్‌లో.. రామ్ తన స్టెప్పులతో దుమ్ము దులిపేశాడు. మణిశర్మ మ్యూజిక్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో వచ్చిన ఈ బీట్ రామ్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తుండగా… సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లో ఉంది. సాకేత్, కీర్తనా శర్మ పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.

హోమ్ బ్యానర్ శ్రీ స్రవంతి మూవీస్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ తొలిసారి డబుల్ రోల్ చేస్తుండగా.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో రామ్‌కు జోడీగా అమృతా అయ్యర్, మాళవిక శర్మ నటిస్తుండగా.. నివేథా పేతురాజ్ ప్రధాన పాత్రలో కనిపించనుంది.

కాగా కరోనా కారణంగా తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దని.. రామ్ అభిమానులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

https://www.youtube.com/watch?v=n0yFRpe9wt0



Next Story