- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ధర్నా.. రామకృష్ణ అరెస్టు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ విజయవాడ బందర్ రోడ్డులోని రంగా సెంటర్ వద్ద సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు సోమవారం ఆందోళన నిర్వహించాయి. విజయవాడలో సెక్షన్ 30, 40 అమల్లో వున్నాయని, ముందస్తు అనుమతులు లేకుండా నిరసనలు, ధర్నాలు చేపట్టకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వామపక్ష నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో విద్యుత్ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ విజయవాడ బందర్ రోడ్డులోని రంగా సెంటర్ వద్ద సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు సోమవారం ఆందోళన నిర్వహించాయి. విజయవాడలో సెక్షన్ 30, 40 అమల్లో వున్నాయని, ముందస్తు అనుమతులు లేకుండా నిరసనలు, ధర్నాలు చేపట్టకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వామపక్ష నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. ఛార్జీలు పెంచలేదంటున్న బుగ్గన బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. అక్రమ అరెస్టులకు భయపడబోమని, లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పెరిగిన విద్యుత్ ఛార్జీలపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
Next Story






