- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సొంతూరులో విషాదం.. మహిళా సర్పంచ్ మృతి
<p>దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామ సర్పంచ్ చల్ల రాజవ్వ శనివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మేడారం సమ్మక్క సారలమ్మ దైవ దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. మార్గమధ్యలో కాటారం మండలంలోని పోతులవాయి సమీపంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబమంతా దిగ్భ్రాంతికి లోనైంది. మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు […]</p>

X
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామ సర్పంచ్ చల్ల రాజవ్వ శనివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మేడారం సమ్మక్క సారలమ్మ దైవ దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. మార్గమధ్యలో కాటారం మండలంలోని పోతులవాయి సమీపంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబమంతా దిగ్భ్రాంతికి లోనైంది. మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత గ్రామం ధన్వాడ. కాంగ్రెస్ కు చెందిన సర్పంచ్ రాజవ్వ మృతి వార్త తెలియగానే ఎమ్మెల్యే శ్రీధర్ బాబు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సర్పంచ్ చల్ల రాజవ్వ మృతితో ధన్వాడ గ్రామంలో విషాదం నెలకొంది.
Next Story






