‘అత్రంగి రే’ ఫైనల్ షెడ్యూల్‌లో ధనుష్

by  |
‘అత్రంగి రే’ ఫైనల్ షెడ్యూల్‌లో ధనుష్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ బాలీవుడ్ ఫిల్మ్ ‘అత్రంగి రే’ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా సెట్స్ నుంచి పిక్ షేర్ చేసిన కోలీవుడ్ హీరో.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఢిల్లీలో 15 రోజుల పాటు షూటింగ్ జరగనుండగా.. ధనుష్, అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకులు. ‘షమితాబ్, రంజానా’ సినిమాల తర్వాత వస్తున్న ధనుష్ హిందీ సినిమా ఇదే కాగా.. ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.

ఏఆర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా అక్షయ్‌కు 130వ సినిమా కాగా.. సారా అలీ ఖాన్ డబుల్ రోల్‌లో కనిపించబోతుందని టాక్. ఇక ఇప్పటికే సింగర్‌గానూ ప్రూవ్ చేసుకున్న ధనుష్.. ఈ సినిమాలో ఒక పాట కూడా పాడాడని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ‘అత్రంగి రే’ మూవీని 2021లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.

ఇక ధనుష్, సాయి పల్లవి నటించిన రౌడీ బేబీ సాంగ్ ఈ మధ్యే 1 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని.. ఆ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ సాంగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed