- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే కార్తీక పౌర్ణమి... ఆరోజు ఏం చేస్తే పుణ్యం వస్తుందంటే?
శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అయితే కార్తీక మాసంలో చేసే పూజల వలన ఎంతో పుణ్యం వస్తుంది అంటారు. అందులోనూ కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన ఆచారాలు ఏంటంటే.. కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నదీ స్నానం చేసి శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. నదీ స్నానం వీలుకాకపోతే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి.
సత్యనారాయణ వ్రతం చేసినా, కథ విన్నా శుభం కలుగుతుంది. తులసి పూజతోపాటు 365 వత్తులతో దీపం వెలిగించి శివాలయంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందట.
ఇతర మాసాలతో పోల్చితే కార్తీకంలో సూర్యకాంతి తక్కువగా ఉండటంతో త్వరగా సూర్యాస్తమయం అయి దట్టమైన చీకటి కమ్ముకుని నిస్సత్తువకు కారణమవుతుందని, అందుకే ఆ చీకటిని పారద్రోలి మనలో శక్తిని పెంపొందించుకోవడానికి ప్రతి గుమ్మం ముందు, గుళ్లలో దీపాలు పెడతారని పండితులు వివరిస్తున్నారు. ఇక కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండడం మంచిది కానీ వీలుకాకపోతే దేవుడిపై మనసు లగ్నం చేస్తూ మితంగా ఆహారం తీసుకోవచ్చని అంటున్నారు.
వాయుపురాణం ప్రకారం పెసరపప్పు-బెల్లం కలిపి వండిన పదార్థాన్ని ఒకసారి మాత్రమే స్వీకరించవచ్చు. సహజ ఫలాలు, నువ్వులు-బెల్లం ఉండలు, పంచామృతం, తులసినీరు వంటివి కూడా తీసుకోవచ్చునని కానీ ఏ ఆహారాన్నైనా ఒకసారి మాత్రమే తీసుకోవడం ఉత్తమమని, మాటిమాటికి తినకూడదని పండితులు సూచిస్తున్నారు.






