- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope : ఈరోజు రాశి ఫలాలు ( march 29)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు కొంచెం ఆవేశంగా మాట్లాడితే స్నేహితులతో చిన్న సమస్యలు రావచ్చు. పాత పెట్టుబడులలో లాభాలు ఇస్తాయి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు అనుభవం ఉన్నవారి సలహా తీసుకుంటే మంచిది. పని మీద ఫోకస్ పెడితే మంచి ఫలితం ఉంటుంది.
వృషభ రాశి
బంధువులతో గడపడంతో కాస్త మనశ్శాంతి కలుగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఆర్ధిక విషయాల్లో మంచి మార్పు ఉంటుంది. సమయాన్ని వృథా చేయకుండా ఉపయోగించుకుంటే అనుకన్నది సాధిస్తారు.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి పాతబకాయిలు వస్తాయి కానీ ఖర్చు జాగ్రత్తగా చేయాలి. ప్రేమ వ్యవహారంలో కాస్త గొడవలు తలెత్తవచ్చు. సాయంత్రం కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఖర్చులు ఎక్కువైనా డబ్బు వస్తూనే ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీకు ఫ్రీ టైమ్ ఎక్కువగా దొరుకుతుంది.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి శరీరానికి విశ్రాంతి అవసరం. ఆర్థికంగా రోజు చివర్లో లాభం ఉంటుంది. ఒంటరిగా సమయం గడిపితే కొత్త ఆలోచనలు వస్తాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
కన్య రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకోకపోతే ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. విదేశీ పెట్టుబడులు లాభం ఇస్తాయి. పెద్దలతో మాట్లాడటం వలన జీవితం పై మంచి అవగాహన వస్తుంది. సమయాన్ని వృథా చేయకుండా ధ్యానం, యోగా చేయడం మంచిది.
తులా రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. మీ ప్రతిభతో డబ్బు సంపాదిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం మెండుగా ఉంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఇతరులకు సహాయం చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. ఆకస్మికంగా డబ్బు వస్తుంది. మీరు చేసిన పనులకు ప్రశంసలు వస్తాయి. పెండింగ్ పనులు పూర్తి చేసుకునేందుకు మంచి రోజు.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశి వారి మాటల వల్ల ప్రేమ వ్యవహారంలో చిన్న సమస్యలు రావచ్చు. తెలియని వ్యక్తుల ద్వారా డబ్బు లాభం ఉంటుంది. రహస్య విషయాలు బయట పెట్టకండి. ఆఫీస్‌లో టెన్షన్ ఉండొచ్చు. భాగస్వామితో చిన్న అపార్థాలు రావచ్చు ఓపికగా ఉండండి.
మకర రాశి
ఈ రోజు ఈ రాశి వారి సృజనాత్మక పనులకు మంచి గుర్తింపు వస్తుంది. పాత పెట్టుబడులు లాభాలని తెస్తాయి. ఇంట్లో పరిస్థితులు కాస్త మారుతూ ఉంటాయి. ఈ రోజు వచ్చే కొత్త సమాచారం మీకు ఉపయోగపడుతుంది. బంధువులను కలుసుకుంటారు.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి కొంచెం శ్రమ ఉన్నా ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో టైమ్ గడపడం వల్ల ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అప్పులు తగ్గుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఫ్రీ టైమ్‌లో క్రియేటివ్ పనులు చేస్తారు.






