- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala news: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
by Yella Dhawani Reddy |
కలియుగ దైవం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల (Devotees) రద్దీ సాధారణంగా ఉంది.

X
దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల (Devotees) రద్దీ సాధారణంగా ఉంది. గత వారం రోజులు శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కాస్తా త్వరగానే స్వామివారి దర్శనభాగ్యం కలుగుతుంది. సోమవారం ఉదయం స్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 4 కాంపాట్‌మెంట్లలో మాత్రమే వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 72,119 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 25,294 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టీటీడీకి రూ.4.02 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Next Story






