- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆన్‌లైన్‌లో మే నెల దర్శన టిక్కెట్లు విడుదల
తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు శ్రీవారి మే నెల దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఇవాళ విడుదల చేయనుంది.

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని వేచి చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక ప్రకటన చేసింది. మే నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన కోటా టిక్కెట్లను ఇవాళ ఆన్‌లైన్ (Online)లో విడుదల చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ వేర్వేరు సమయాల్లో ఈ టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
అయితే, మొదట ఉదయం 10 మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. ఇక ఉదయం 11 గంటలకు శ్రీవాణి (SRIVANI) ట్రస్ట్ టిక్కెట్లు, అందుకు సంబంధించిన దర్శన కోటాను రిలీజ్ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సంబంధించిన ప్రత్యేక దర్శన కోటా టిక్కెట్లు విడుదల కానున్నాయి. అయితే, దర్శన టిక్కెట్లు పొందాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా ‘TTDevasthanams’ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. టిక్కెట్లు విడుదలైన కొద్ది నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉన్నందున, భక్తులు ముందే తమ వివరాలతో సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.






