- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. కిక్కిరిసిన కంపార్ట్‌మెంట్లు
by Kema Shiva Kumar |
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)కు భక్తులు పోటెత్తారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)కు భక్తులు పోటెత్తారు. బుధవారం శ్రీవారి దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 7 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex) లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులతో నిండిపోయి ATGH వరకు క్యూ లైన్ కొనసాగుతోంది. బుధవారం స్వామి వారిని 83,261 మంది భక్తులు దర్శించుకోగా.. అందులో 33,445 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story






