- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వినాయకుడికి రూ.474 కోట్ల ఇన్సూరెన్స్.. ఎక్కడ? ఎందుకంటే?
ఈ నెల 27న దేశవ్యాప్తంగా వినాయక చతుర్థి వేడుకలు జరుగున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఈనెల 27న దేశవ్యాప్తంగా వినాయకుడి పండుగ జరుపుకోనున్నారు. నాటి నుంచి గణపతి నవరాత్రి (Ganesh Navratri) ఉత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. ఇందుకోసం విభిన్న ఆకృతుల్లో అందంగా వినాయకుడి ప్రతిమలు సిద్ధంగా ఉండగా, గణనాథుడు కొలువుదీరే మండపాలను కూడా నిర్వాహకులు రెడీ చేస్తున్నారు. ఇక వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే నగరాల్లో ముంబై ఒకటి. ఇక్కడ ఉన్న భారీ వినాయక విగ్రహాలు, భారీ సెట్టింగ్‌లతో ఏర్పాటు చేసే మండపాలు చాలా మందిని ఆకర్షిస్తాయి. అందులోనూ ముంబైలోని కింగ్స్ సర్కిల్ జీఎస్‌బీ సేవా మండల్ ( GSB Seva Mandal ) అత్యంత సంపన్న గణేశ్ మండల్‌గా పేరుగాంచింది. ఈ నిర్వాహకులు నగరంలో గత 70 ఏళ్లుగా మండపాన్ని ఏర్పాటు చేస్తోన్నారు.
ఇక ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జీఎస్‌బీ సేవా మండల్ వినాయకుడు వార్తల్లో నిలిచారు. నిర్వాహకులు గణనాథుడి మండపానికి రూ.474.46 కోట్లకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. గతేడాది వీరు రూ.400 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని బద్దలుకొట్టాడు. కాగా, వినాయక నవరాత్రి వేడుకల్లో మండపాన్ని దర్శించే ప్రతి భక్తుడూ బీమా పరిధిలోకి వస్తాడని నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు, మండపంలోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు, ఉత్సవాల్లో పాల్గొనే వాలంటీర్లు, పూజారులు, వంటవాళ్లు, పాదరక్షలను భద్రపరిచేవారు, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది ఈ బీమా పరిధిలోకి వస్తారు. అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో రెండు కోట్ల రూపాయల బీమా తీసుకున్నారు. అక్కడి ఫర్నీచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నాయి. వినాయకచవితి నుంచి 10 రోజుల పాటు నిర్వాహకులు, భక్తులకు ఈ బీమా వర్తిస్తుందని వివరించారు. ఏటా ఇటువంటి బీమా తీసుకుంటున్నప్పటికీ ఈసారి రికార్డు స్థాయిలో గరిష్ఠ మొత్తానికి బీమా చేయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.






