Lord Shiva: శివుడికి అత్యంత ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

by Phanindra |

మహాశివరాత్రి ( Mahashivratri ) రోజున శివపార్వతులను ( Lord shiva ) పూజిస్తాం.

Lord Shiva: శివుడికి అత్యంత ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్ : మహాశివరాత్రి ( Mahashivratri ) రోజున శివపార్వతులను ( Lord shiva ) పూజిస్తాం. నేటి ఉదయం నుంచి భక్తులు శివ దర్శనం కోసం శివాలయాలకు వెళ్తున్నారు. హిందువులు జరుపుకునే పండగల్లో శివరాత్రి కూడా ఒకటి. ఈ రోజన ఎంతో మంది ఉపవాసం ఉండి, జాగరణ చేస్తారు. అలాగే, ప్రత్యేకమైన అభిషేకాలతో ఆ భోళా శంకరుడిని పూజించి ఆయన అనుగ్రహం పొందుతారు. ఆర్ధిక సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యలు చెబుతున్నారు. అన్ని దేవుళ్ళకు ఇష్టమైన రాశులు ఎలా ఉంటాయో .. శివుడికి కూడా ఇష్టమైన రాశులు ఉన్నాయి. ఫిబ్రవరి 26 న అర్దరాత్రి శివయోగం ఏర్పడబోతోంది. అప్పుడు పరమ శివునికి ప్రీతికరమైన రాశులు అనుగ్రహం పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి శివుడి అనుగ్రహం వలన పనులన్ని పూర్తి చేస్తారు. అలాగే, వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా, లాభాలు పెరుగుతాయి. ఈ శివయోగం వల్ల మనసులో కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. కొత్త భూములను కొనుగోలు చేస్తారు. విద్యా రంగాల్లో పనులు చేసేవారికి ఎల్లప్పుడు కొత్త అవకాశాలు వస్తాయి.

ధనుస్సు రాశి

శివుడికి ఎంతో ఇష్టమైన రాశుల్లో ధనుస్సు రాశి కూడా ఒకటి. ఈ శివయోగం వలన పెట్టుబడులు పెట్టిన వారికీ లాభాలు వస్తాయని జ్యోతిష్యు నిపుణులు చెబుతున్నారు. అలాగే, డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా, మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొత్త నులు కూడా మొదలు పెట్టె అవకాశం ఉంది. ఈ సమయంలో కారు లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story