Tirumala updates : కొనసాగుతున్న భక్తుల రద్ధీ..సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే.?

by Malleboina Mahesh |   (  Updated:2025-06-08 04:33:29  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతికి గత మూడు వారాల నుంచి భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది.

Tirumala updates : కొనసాగుతున్న భక్తుల రద్ధీ..సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే.?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) గత మూడు వారాల నుంచి భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఆదివారం కావడం, వేసవి సెలవులు ముగియనుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుపతి (Tirupati) కొండపై భక్తుల కిటకిటలాడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. కాగా శనివారం కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో.. నిన్న స్వామివారిని 88,257 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 45,068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తుల కానుకలతో శ్రీవారి హుండీల ద్వారా టీటీడీకి 3.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

Next Story