- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివరాత్రి వేళ మంత్రి కోమటిరెడ్డి కీలక డిమాండ్
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: మహాశివరాత్రి(Maha Shivaratri 2026) పర్వదినం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. వందల ఏళ్ల చరిత్రను సాక్షిగా నిలబెట్టుకున్న ఈ ప్రాచీన దేవాలయాలు తెలంగాణ సంస్కృతి, శిల్పకళ వైభవానికి ప్రతీకలు అని కొనియాడారు. 11–12వ శతాబ్దాలకు చెందిన ఈ ఆలయాల్లో అద్భుతమైన శిల్ప సంపద ఉట్టిపడుతుందని చెప్పారు. ముఖ్యంగా ఛాయా సోమేశ్వరాలయం గర్భగుడిలో ఎల్లప్పుడూ ఒకే విధంగా కనిపించే నీడ విశేష ఆకర్షణ అని గుర్తుచేశారు. ఈ ఆలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యునెస్కో గుర్తింపు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తారు. పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.






