Today's Horoscope : ఈరోజు రాశి ఫలాలు ( MARCH 28 )

by Batti.Sumithra |

ఈ రోజు ఏ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Todays Horoscope : ఈరోజు రాశి ఫలాలు ( MARCH 28 )
X

మేష రాశి

ఈ రోజు ఈ రాశి వారి ఓర్పును కొంతమంది పరీక్షించే అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. డబ్బు సేవ్ చేయాలనే ఆలోచన ఈ రోజు అమలు అవుతుంది. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

వృషభ రాశి

ఈ రోజు ఈ రాశి వారికి ఉన్న టెన్షన్లు తగ్గి కాస్త మనశ్శాంతితో గడుపుతారు. పాత పెట్టుబడుల వల్ల లాభాలు గడిస్తారు. పొరుగువారితో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో కాస్త ఒడిదుడుకులు కలగవచ్చు.

మిథున రాశి

ఈ రోజు ఈ రాశి వారు వారి మాటలతో ఇతరులను ఆకట్టుకుంటుంది. డబ్బును వృధాగా ఖర్చు చేయడం మంచిది కాదు. అవసరానికి డబ్బు కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఆర్థిక విషయాల్లో బంధువులు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారంలో చిన్న చిన్న బాధలు ఉండొచ్చు. ఎదుటి వారితో మాట్లాడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.

కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశి వారికి చుట్టూ ఉన్నవారు సహాయం చేస్తారు. ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. ఆర్ధిక విషయాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు.

సింహ రాశి

ఈ రోజు ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారంలో నిరాశ కలగొచ్చు. డబ్బు విలువ ఈ రోజు బాగా అర్థమవుతుంది. అనవసర గొడవలకు వెళ్లకుండా ఉంటే మంచిది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెద్దవారి నుంచి జీవిత పాఠాలు నేర్చుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం వల్ల పనులు ఆగిపోవచ్చు.

కన్య రాశి

ఈ రోజు ఈ రాశి వారు అనుకున్న పనులు సాధిస్తారు. పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

తులా రాశి

ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరిస్ధితులు మెరుగుపడతాయి. కోపం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. ప్రేమ విషయాల్లో పెద్దగా పురోగతి ఉండదు. ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు.

వృశ్చిక రాశి

ఈ రోజు ఈ రాశి వారికి కొంచెం అలసటగా అనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కుటుంబంతో సమయం గడుపుతారు. దూరం నుండి శుభవార్త వచ్చే అవకాశం ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్న సమస్యలు రావచ్చు.

ధనుస్సు రాశి

ఈ రోజు ఈ రాశి వారు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబ విషయాల్లో సోదరులు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారంలో చిన్న గొడవలు రావచ్చు. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కార్యాలయంలో బాస్ నుంచి ప్రశంసలు రావచ్చు.

మకర రాశి

ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించడం అవసరం. ఒకరి సలహా వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సరదాగా ఉంటుంది. భాగస్వామితో మీ సమస్యలు పంచుకుంటారు. చిన్న విషయాలకు గొడవలు రావచ్చు.

కుంభ రాశి

ఈ రోజు ఈ రాశి వారికి దానాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. రహస్యాలను ఎవరికైనా చెప్పేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

మీన రాశి

ఈ రోజు ఈ రాశి వారు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్ధిక విషయాల్లో కాస్త కష్టంగా ఉండొచ్చు. పాత సంబంధాలు బలపడతాయి. ప్రయాణంలో కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది.

Next Story