లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు

by Naga Rani Yarlagadda |

వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగినట్లు టీటీడీ వెల్లడించింది. మళ్లీ లాంగ్ వీకెండ్ (వరుసగా మూడ్రోజులు సెలవులు) రావడంతో తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తుండగా.. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 12 గంటలు పడుతుందని పేర్కొంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనం భక్తులకు 3-4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న (గురువారం) స్వామివారిని 62,642 మంది భక్తులు దర్శించుకోగా.. 23,887 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు సమకూరింది.

Next Story