- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటితో ముగియనున్న కుంభమేళా.. పోటెత్తిన భక్తజనం
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా నేటితో ముగియనుండటంతో భక్తులు పొటెత్తారు.

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela) నేటితో ముగియనుండటంతో భక్తులు పొటెత్తారు.మహా శివరాత్రి (Shivaratri), కుంభమేళా చివరి రోజు కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో త్రివేణి సంగమం ఘాట్లు 'హర హర మహాదేవ్' నామస్మరణలతో మార్మోగుతున్నాయి.
ఈ కుంభమేళాలో నేడు చివరి అమృత్ స్నానం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా సన్నాహాలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ఈ ప్రాంతాన్ని ఇప్పటికే నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే జనం అటు వారణాసి, ఇటు అయోధ్యలను సందర్శిస్తున్నారు. దీంతో ఆ ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
కాగా, పుష్య పౌర్ణమి జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా మహా శివరాత్రి ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. ఈ రోజు మహా శివరాత్రి కావటం, చివరి రోజు కావటంతో దాదాపు 5 కోట్లకు పైగా భక్తులు కుంభమేళా విచ్ఛేసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనం అయ్యేలా ప్రయాగ్‌రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.






